యూదా ప్రాంతానికి ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజుగా వున్నాడు హిజ్కియా యెరూషలేమును రాజధానిగా చేసికొని 29 సం||లు పరిపాలించాడు.
అతడు తన పితరుడైన దావీదు మహారాజు వలె యెహోవా దృష్టికి అనుకూలమైన పనులు చేశాడు. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ఉన్నత స్థలములను పడగొట్టించాడు. అన్యదేవతల విగ్రహములను పడగొట్టించాడు. తన పరిపాలనలోని మొదటి సం||ము మొదటి నెల యెహోవా మందిరాన్ని
ప్రతిష్టించాడు. అందులో వున్న నిషిద్ధ వస్తువును, విగ్రహాలను కేద్రోను వాగులో పారవేయించాడు. యెహోవా మందిరంలో దేవుని సేవ క్రమంగా జరిగింది.
రాజు, ప్రజలు మిక్కిలి సంతోషించారు.
పస్కాపండుగను చాల ఘనంగా చేయాలని నిర్ణయం చేయబడింది. చుట్టు ప్రక్కల వున్న నగరాలన్నింటికి ఆహ్వానాలు పంపబడ్డాయి. కొన్ని వేలమంది యూదులు యెరూషలేముకు తరలి వచ్చారు. ఏడు రోజులు జరిగిన పస్కాపండుగలో పాల్గొన్నారు. దావీదు, సొలొమోను కాలముల తర్వాత పస్కా పండుగ యింత గొప్పగా జరుగలేదని చెప్పుకొన్నారు. యూదులు తమ తమ నగరాలకు తిరిగి వెళ్ళారు. అక్కడి అన్యదేవతల విగ్రహాలను పడగొట్టి యెహోవా దేవుని ఆరాధింపసాగారు. ప్రజలందరు దేవుని యెడల భయభక్తులతో మెలగసాగారు.
హిజ్కియా పరిపాలనా కాలంలో 14వ సం||ము అపూరు రాజైన సనైబు యూదా దేశంపై దండెత్తాడు. హిజ్కియా అతడు కోరిన 60 మణుగుల బంగారము, 600 మణుగుల వెండి పంపించాడు. అయినా అషూరు రాజు తృప్తి చెందలేదు. “మీరాజు సైనికశక్తి ఏపాటిది. మీరాజు మీదేవుడు యూదా.వారిని నా నుండి కాపాడలేరు” అని గర్వంగా మాట్లాడాడు హిజ్కియాకు ఈ మాటలన్నీ తన ప్రధానుల ద్వారా తెలిశాయి. అతడు యెహోవా మందిరానికి వెళ్ళి దీనంగా ప్రార్థించాడు. ఈ విషయంలో దేవుడు తన ప్రవక్త యెషయా ద్వారా ఏమి సెలవిస్తాడో తెలిసికొని రమ్మని దూతలను పంపాడు. యెషయా ప్రవక్త దేవుడు తనకు తెలియజేసిన సంగతులు దూతలతో చెప్పి పంపాడు. “నీ విజ్ఞాపన నేను విన్నాను. అషూరు రాజు యెహోవానైన నన్ను దూషించి, ఎగతాళి చేశాడు. అతడు ఎక్కువ గర్వించాడు. అతడు యెరూషలేము పట్టణంలో ప్రవేశింపడు. ఒక్క బాణమైనా ప్రయోగింపడు. అతడు వచ్చిన దారినే తిరిగి పోతాడు” ఆరాత్రి యెహోవా దూత అప్పూరు రాజు సైన్యంలోని లక్షా ఎనుబది అయిదువేల మంది సైనికులను సంహరించింది. వారిని ఎవరు చంపారో,
ఎలా చంపారో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ దృశ్యం చూసిన అపూరు రాజు భయపడి, మిగిలిన సైన్యంతో నినివె పట్టణానికి వెళ్ళిపోయాడు. అతడు నిన్రోకు
అనే దేవత మందిరంలో మ్రొక్కు చుండగా అతని యిద్దరు కుమారులు అతణ్ణి చంపి పారిపోయారు. మరియొక కుమారుడు ఎనర్హరోను అతనికి బదులు
రాజయ్యాడు. ఈ విధంగా దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటలు నెరవేరాయి. హిజ్కియా రాజుకు సునాయాసంగా విజయం లభించింది.
హిజ్కియా రాజుకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. యెషయా ప్రవక్త రాజును చూడటానికి వెళ్లాడు. “నీవు కొద్ధి రోజులలో చనిపోతావు. బంధువులకు చెప్పవలసిన మాటలు చెప్పి మరణానికి సిద్ధంగా వుండు” అన్నాడు. ప్రవక్తమాటలు వినిన రాజు ఎంతో దుఃఖపడ్డాడు. “యెహోవా! నా దేవా! నేను నిన్నే నమ్మి యదార్థ హృదయంతో సేవించాను. నీ దృష్టికి అనుకూలమైన పనులే చేశాను.నా పై నీ కృప చూపించు" అని కన్నీటితో ప్రార్థించాడు.
దేవుడు హిజ్కియా రాజు ప్రార్థన ఆలకించాడు. యెషయా ప్రవక్తను హిజ్కియా దగ్గరికి వెళ్ళి యిలా తెలియజేయమని చెప్పాడు - "నేను నీ ప్రార్థన ఆలకించాను, నిన్ను బాగుచేస్తాను. మూడవ దినమున నీవు దేవుని మందిరానికి వెళ్తావు. నేను నీకు 15 సం॥లు ఆయుష్షును పొడిగిస్తున్నాను.
నిన్ను, నీ పట్టణాన్ని శతృవులనుండి కాపాడుతాను” యెషయా రాజుతో ఈ మాటలు చెప్పాడు. అంజూరపు పండ్లు ముద్దచేసి కురుపు మీద వేసిన తర్వాత రాజు బాగయ్యాడు. దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేరుతాయని నాకు రుజువేమిటి? అని యెషయాను అడిగాడు. అందుకు యెషయా ప్రవక్త
“పదిమెట్లు ముందుకు నడిచిన నీడ, పదిమెట్లు వెనుకకు నడవడమే యిందుకు సూచన” అని చెప్పాడు. యెషయా ప్రార్థించగా దేవుడు గడియారపు పలక మీద పదిమెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాడు. హిజ్కియా రాజు యొక్క పరాక్రమాన్ని గురించి, ఆయన ఉత్తమ గుణాలను గురించి, ఆయన కొలనులను త్రవ్వించి కాలువల ద్వారా యెరూషలేముకు నీటిని రప్పించిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథములో వ్రాయబడింది.
హిజ్కియా రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడు మనషే యూదాదేశపు రాజయ్యాడు.
ధ్యానాంశములు:
1. హిజ్కియారాజు గొప్ప భక్తుడు. ధర్మశాస్త్రమును అనుసరించినవాడు, నీతి కార్యములు జరిగించినవాడు.
2. దేవుడు హిజ్కియాకు తోడుగా వున్నాడు. యుద్ధములలో విజయాన్ని అనుగ్రహించాడు.
3. హిజ్కియాదేవుని పట్ల విధేయుడై వున్నాడు. కనుక మరణకరమైన రోగం నుండి కాపాడబడ్డాడు. అంతేకాక అతని ఆయుషు 15 సం||లు
పొడిగింపబడింది. దేవుని పట్ల కృతజ్ఞత చూపాడు. పస్కా పండుగను గొప్పగా జరిగించాడు.
5. అన్య దేవతల విగ్రహాలను, బలిపీఠములను పడగొట్టించాడు. యెహోవా దేవునికి క్రమముగా సేవలు జరిగించాడు.
6. యెహోవా మందిరాన్ని ప్రతిష్టించి, అన్యదేవతల వస్తువులను కేద్రోను వాగులో పారవేయించాడు.
7. దేవుని యందు భయభక్తులుగల వారిని ఆయన తప్పకుండా కాపాడుతాడు. అనే సత్యము హిజ్కియా కథ ద్వారా తెలియుచున్నది.
బంగారు వాక్యము:
కావున యెహోవా అతనికి తోడుగా వుండెను, తాను వెళ్ళిన చోటనెల్ల అతడు జయము పొందెను.
2 రాజులు 18:7
No comments:
Post a Comment