* నా తల్లి వంటి తల్లి ప్రతివానికుండిన చెరసాల అవసరము లేదు!
* నేను లోకముతో నడిస్తే దేవునితో నడువలేను!
* దేవుని మార్గం కష్టమైనది కాదు ఇరుకైనది!
* వాస్తవంగా నెరవేర్చలేనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ చేయలేదు!
* దేవునికి కావాల్సింది వెండి బంగారు పాత్రలు కాదు
శుద్ధమైన పాత్రలు!
*యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్ధించుట నేర్పించెను గాని, బోధించటం కాదు!
* సాతాను వేరుపరుచును, దేవుడు జతపరుచును, ప్రేమ బందించియుంచును!
* నీవున్న చోట, నీకున్న దానితో, నీవు చేయగలిగినది దేవుని కొరకు చెయుము!
* క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటయే నా పని!
* చీకట్లో మీరు వ్యవహరించేతీరే మీ గుణం!
* నేను నా ప్రవర్తన గురించి శ్రద్ధవహించినట్లైతే, నా పరువు ప్రతిష్టలు వాటికవే కాబడబడతాయి!
* ఇతరుల తప్పులు పట్టుకొన ప్రయత్నిస్తున్నంత కాలం, నా హృదయం అంతకంతకు చెడిపోవుచున్నది!
* పూర్తిగా దేవునికి అప్పగించుకున్న వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తితో, ఆ వ్యక్తి కొరకు ఆ వ్యక్తిలో దేవుడు ఏమి చేయునో లోకము ఇంకా చూడవలసి ఉన్నది ఆ వ్యక్తిగా నేనుండగోరుచున్నాను
* నీ యందు నీవు నమ్మికయుంచుకో, నీకు నిరాశ మిగులుతుంది! నీ స్నేహితులను నమ్ముకో, వారు చనిపోయి నీ దారిని నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు కానీ, దేవుని యందు నమ్మికయుంచినట్లైతే నీవు ఈ లోకములోను నిత్యత్వములోను కలవరపడవు!
No comments:
Post a Comment