ఆఫ్రికా దేశానికి ఒకాయన సువార్త చెప్పడానికి వెళ్లి
ప్రియలారా! రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చెను ఈ లోకములోని వారిపై అత్యధిక ప్రేమను చూపించెను ఆయన రోగులను ముట్జగా వారు స్వస్థత పొందిరి దయ్యములు పారిపోయినవి ఆయనెంతో ప్రేమగా పాపులను పలుకరించెను ఆదరించెను. ఎంతో ప్రేమ కలిగి పరిశుద్దుడుగా, దీనుడిగా జీవించినాడని ప్రభువును గూర్చి వివరించుచుండెనట! కూటమైన తరువాత
అచ్చటి ప్రజలు వచ్చి “మీరు చెస్పిన ఆయనను మేము చూచితిమి,ఆయన మాకు బాగా తెలుసు. ఆయన మా దగ్గరనే ఉండెనని అన్నారట
అందుకు ఆ సువార్తికుడు, “ఏమిటయయ్య! మీరు చెప్పేది ఆయన రెండు వేల సంవత్సరముల క్రితమే చనిపోయి, తిరిగిలేచి పరలోకమునకు
ఆరోహణమైనాడని" చెప్పగా, “‘ లేదండి! ఆయన మా మద్యనే ఉండేవాడు ఆయన మాకు బాగా తెలుసునండి ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించేవాడు. ఎప్పుడు ప్రేమతో మమ్ములను పలుకరించెడివాడు
ఆయన ప్రార్థిస్తే స్వస్థతలు కలిగేవి. దయ్యాలు పట్టినవారు విడుదల పొందేవారు. అంతేకాదు ఆయన మా మధ్యనే చనిపోయినాడు, ఆయనను మేమెంతో ప్రేమించినాము. మేము ఆయన గుండెను మా దగ్గరే ఉంచుకున్నాము; రండి చూపిస్తామని తీసుకొనివెళ్ళి చూపించారు. తీరా వెళ్ళి చూస్తే అది “డేవిడ్ లివింగ్‌స్టన్” సమాధి,
ఆయన ఆఫ్రికా దేశములో ఆ అరణ్యవాసుల మధ్య క్రీస్తులాగా జీవించెను. అక్కడ ఉన్నవారు ఆయనలో క్రీస్తును చూడగలిగిరి. మనలో ఇతరులు క్రీస్తు గుణములను చూడగలుగుచున్నారా?
“ప్రేమ గలిగి సత్యము చెప్పను క్రీస్తువలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము,” (ఎఫెసీ 4:15)
No comments:
Post a Comment