Breaking

Thursday, 18 July 2019

ప్రార్థన, వాక్యం



 "ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి నా ఇంటిలో ఒంటరిగా వుండటం నాకు ఇష్టం.—డేవిడ్ బ్రెయినార్డ్

"నీ ప్రార్థన గదికి వెళ్లే మార్గంలో పిచ్చి మొక్కలు, ముళ్ల తుప్పలు మొలిచాయి అని అంటే నీవు ఆ గదికి వెళ్లి చాలా దినములు అయ్యిందన్న మాట"—E.M.Bounds

"లేఖనాలను దేవుడు మన తెలివిని పెంచుకోవడానికి ఇవ్వలేదు,మన బ్రతుకులను మార్చుకోవడానికి మాత్రమే ఇచ్చాడు"—D.L.మూడీ

 "బైబిల్ లోని భాగాలు అర్థం కాకపోతే కాదు,అర్థమై విధేయత చూపించక పోతేనే నాకు బాధగా వుంటుంది."—Mark Twain

"ఒక పక్షికి రెండు రెక్కలేలాగో ఒక విశ్వాసికి బైబిలు,ప్రార్థన అలాంటివి"—సాధు సుందర్ సింగ్

"నేను ఎంత అలసిపోయినప్పటికి  తప్పకుండా బైబిలును ధ్యానించిన తర్వాతే  నిద్రపోతాను"—డగ్లస్ మెక్ ఆథర్


 "చెరసాల నుండి పేతురును దూత బయటకు తీసుకొని వచ్చెను కానీ దూతను చెరసాల దగ్గరకు తీసుకొని వచ్చినది ప్రార్థన"—థామస్ వాట్సన్


" లోకంలో పడకుండా వుండాలంటే ఒకే ఒక్క మార్గము 'మోకాళ్ల మీద పడటమే' "


"పవిత్ర గ్రంథమైన బైబిలును శ్రద్ధతో చదవడానికి నా దగ్గర వున్న పుస్తకాలు ఆటంకంగా మారితే నేను వాటన్నింటిని నాశనం చేస్తాను"—మార్టిన్ లూధర్


"మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది"—విలియం కేరీ


"ఇప్పటికి నేను బైబిలు గ్రంథమును 100 సార్లు చదివియున్నాను,తొలిసారి దానిని చదివినప్పటికంటే అది ఇప్పుడు ఎంతో మధురముగా వున్నది"—చార్లెస్ స్పర్జన్


 "ప్రపంచంలో చాలా పుస్తకాలు Information ని ఇవ్వగా,మరికొన్ని పుస్తకాలు Reformation ని ఇవ్వగా, కేవలం ఒకే ఒక పుస్తకం Transformation ని ఇస్తుంది. అదే Bible"—బిల్లీగ్రేహం

No comments:

Post a Comment