Breaking

Tuesday 21 May 2024

thambura sithaara naadamuthoతంబుర సితార నాదముతో

 



thambura sithaara naadamutho :


తంబుర సితార నాదముతో

క్రీస్తును వేడగ రారండి

ఇద్దరు ముగ్గురు కూడిన చోట

ఉంటాననిన స్వామికే (2) ||తంబుర||


1.పాపులకై దిగి వచ్చెనట

రోగులకే వైద్యుడని

పాపుల పంక్తిని కూర్చొని (2)

విందులు చేసిన యేసునకే

పేదల పాలిట పెన్నిధికే ||తంబుర||


2.ప్రతి హృదయం ప్రభు మందిరమై

వెలుగులతో విలసిల్లి

నీ శోధనలను సమిధలుగా (2)

నరకాగ్నులలో పడవేసి

క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||

No comments:

Post a Comment