Breaking

Sunday, 26 November 2023

కంచే వేశావు

కంచే వేశావు మా ఇంటికి

కరుణ చూపావు మా బ్రతుకులో

నీతి సూర్యుడా తేజోమయుడా
నీ వెలుగు మా ఇంట నింపావయ్యా
నీవుండగా ఏ లోటు లేనెలేదు యేసయ్యా
నేను నా ఇంటివారము నిన్నే సేవించెదం
దీన దశలో మేముండగా
శోధనలన్నీ దూరము చేసితివి
నీరు కట్టిన తోటగ చేసి
ఫలము పంటలతో సమృద్ధి నిచ్చితివి
యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ
మా ప్రతి అవసరము తీర్చావయ్యా
పరిస్థితులన్నీ చేజారగా
చుక్కాని నీవై దరిచేర్చినావు
వ్యాధి భాధలు రాకుండ చేసి
మేమెళ్ళు స్థలమందు ఆశ్రయమైనావు
యెహోవా రోహివై సంరక్షించుచు
మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి

No comments:

Post a Comment