Breaking

Saturday, 30 September 2023

kontha sepu kanabadi anthalone కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే

 


కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే - ఆవిరివంటిదిరా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం..

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..




ఎదురౌతారెందరో నీ పయనంలో - నిలిచేది ఎందరు నీ అక్కరలో..

వచ్చేదెవరు నీతో మరణమువరకూ - ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవము నీకు..

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..




చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి - ఆస్తులు సంపాదించినా శాంతి వున్నదా...?!

ఈరాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే - సంపాదన ఎవరిదగును యోచించితివా...?!

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..




నీ శాపం తాను మోసి పాపం తీసి - రక్షణభాగ్యం నీకై సిద్ధము చేసి..

విశ్రాంతినీయగా నిన్ను పిలువగా - నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా...?!

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు

No comments:

Post a Comment