Breaking

Thursday, 3 August 2023

హృదయమా హృదయమా నా హృదయమా - hrudayama hrudayama na hrudayama song lyrics telugu

click on image 



నిన్నే తలచి నిన్నే వలచి -

దేవుడే మనుష్యుడైన చిత్రము చూడుమా

ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా

హృదయమా హృదయమా నా హృదయమా -

యేసయ్య ప్రేమను గాంచుమా

ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా - యేసయ్య

స్నేహము గోరుమా (నిన్నే తలచి)


1. స్థిరమే లేని మనుషుల ప్రేమలు -

నటనయే చూపుచు కదిలే బొమ్మలు (2)

కలుగజేయునే నీకు గాయము -

చేయలేవులే ఏ సాయము

గాయాలన్ని గేయాలుగా మార్చును నీకు యేసయ్య

సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట - దాచును

మెస్సయ్య

నీలో నిలచి నీతో నడచి

మార్గమే చూపిన మంచి దేవుడు - అనురాగమే

పంచిన ఆత్మీయుడు (2) (హృదయమా)


2. రేపటి తలపుతో నేడే కలతతో -

కృంగుట ఎందుకు కలవరమెందకు (2)

నమ్మదగినవాడు నీ దేవుడు -

సర్వకాలము నిన్ను విడువడు

వాగ్దానమే నీకుండగ - భయమేలనే ప్రాణమా

వర్ణింపగ సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ

నిన్నే పిలిచి - తనలా మలచే

యేసుపై ఆనుకో నా ప్రాణమా - ఆ యేసునే నమ్ముకో

అంతరంగమా (2) (హృదయమా)





No comments:

Post a Comment