Breaking

Tuesday, 1 August 2023

Ellappudunu Prabhuvunandu song lyrics | ఎల్లప్పుడును ప్రభువునందు



Ellappudunu Prabhuvunandu song lyrics :


ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి

ప్రతి సమయములోను…

ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)

యెహోవా చేసిన మేలుల కొరకై

ఎల్లప్పుడును ఆనందించండి (2)

ఆరాధించండి          ||ఎల్లప్పుడును||


1.పాపంబు తోడ చింతించుచుండ

నరునిగా ఈ భువిలో ఉదయించెగా

మన పాప భారం తన భుజమున మోసి

మనకై తన ప్రాణం అర్పించెగా (2)

ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి

ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే     ||ఎల్లప్పుడును||


2.విశ్వాసమునకు కలిగే పరీక్ష

ఓర్పును కలిగించే ఒక సాధనమై

శోధనకు నిలిచి సహించిన వేళ

జీవ కిరీటమును పొందెదము (2)

నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి

సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ||ఎల్లప్పుడును||


3.ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి

మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి

మనతో నివాసమును కలిగి యుండుటకు

త్వరలోనే రారాజుగా రానైయుండె (2)

శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి

సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి      ||ఎల్లప్పుడును||









No comments:

Post a Comment