Breaking

Sunday, 30 July 2023

Ennika Leni Naapai song lyrics - ఎన్నిక లేని నాపై

 



Ennika Leni Naapai song lyrics


ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు

ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2)

నీకే నీకే నీకే పాదాభివందనము

నీకే నీకే నీకే స్తోత్రాభివందనము       ||ఎన్నిక||


1.బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు

ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2)

ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను

ఏ రీతి నిను నేను సేవించను (2)        ||నీకే||


2.పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు

ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2)

ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను

ఏ రీతి నిను నేను సేవించను (2)        ||నీకే||









No comments:

Post a Comment