Breaking

Friday, 7 July 2023

ఈ జీవితం విలువైనది - Ee Jeevitham Viluvainadi




ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు           ||ఈ జీవితం||

1.సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం||

2.మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం||

3.పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)        ||ఈ జీవితం||







No comments:

Post a Comment