Breaking

Tuesday, 6 June 2023

ఆరాధించెదము ఆత్మతో - Aaraadhinchedamu Aathmatho




Aaraadhinchedamu Aathmatho song lyrics :


ఆరాధించెదము ఆత్మతో నిరతము

యెహోవా దేవుని మనమంతా

ఆనంద గానము మనసారా పాడుచు

అనుదినం కీర్తింతుము రారాజును – (2) ||ఆరాధించెదము||


1.అక్షయ నాథుడు అద్వితీయుడు

పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2)

ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2)

అమరుడై యున్నవాడు మన దేవుడు (2)       ||ఆరాధించెదము||


2.సత్య స్వరూపి మహోన్నతుడు

మహిమాన్వితుడు మనకును తండ్రియే (2)

ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2)

పరమందు ఆసీనుడు పూజార్హుడు (2)        ||ఆరాధించెదము||


3.సమస్తమునకు జీవాధారుడై

శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2)

భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2)

యుగములకు కర్తయే శ్రీమంతుడు (2)        ||ఆరాధించెదము||








No comments:

Post a Comment