Breaking

Thursday, 18 May 2023

Akasham nee simhasanam | ఆకాశం నీ సింహాసనం



Akasham nee simhasanam song lyrics : 


ఆకాశం నీ సింహాసనం

భూమి నీ పాదపీఠం (2)

సర్వోన్నతుడా సర్వాధికారి

అందుకో ఇల నా హృదయ వందనం

అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2)

మార్గము నీవే – జీవము నీవే          ||ఆకాశం||


1.పరలోక తెరపైట తొలగించగా

స్తుతి గీత పాటలు వినిపించగా (2)

పరిశుద్ద ఆత్ముడు నను తాకగా

రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా   ||ఆకాశం||


2.నీ స్వరము ఉరుమై వినిపించగా

అదిరింది నా గుండె ఒకసారిగా (2)

నీ కిరణాలు మెరుపై నను తాకగా

వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా    ||ఆకాశం||


3.భువిలోని సృష్ఠంత నీ మాటగా

దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2)

పరలోక రాజ్యానికి నువ్వు దారిగా

వెలిసావు ధరపైన నా యేసుగా       ||ఆకాశం||
















No comments:

Post a Comment