Vivaahamannadi song lyrics :
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
1.ఎముకలలో ఒక ఎముకగా
దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా
స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)
2.ఒంటరిగా ఉండరాదని
జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని
పురుషుని నియమించినాడు దేవుడు (2)
3.దేవునికి అతిప్రియులుగా
ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని
ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)
No comments:
Post a Comment