Breaking

Friday, 9 December 2022

Maargamu Choopumu Intiki - మార్గము చూపుము ఇంటికి

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి

మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2)


1.పాప మమతల చేత – పారిపోయిన నాకు

ప్రాప్తించె క్షామము

పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు

పంపుము క్షేమము (2)

ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు

పుట్టించె ధైర్యము (2)                    ||మార్గము||


2.ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు

తండ్రిని వీడితి

ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ

దేహీ నిను చేరితి (2)

దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు

దారిని జూపుము (2)     ||మార్గము||


3.దూర దేశములోన – బాగుందుననుకొనుచు

తప్పితి మార్గము

తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల

తరిమే దారిద్య్రము (2)

దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి

ధన్యుని చేయుము (2)                  ||మార్గము||


4.అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు

ఆకలి బాధలో

అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ

అలవడెను వేదన (2)

అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత

ఆశ్రయము గూర్చుము (2)        ||మార్గము||


5.కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు

కోపించి వెళ్ళితి

కూలివానిగనైన – నీ యింట పని చేసి

కనికరమే కోరుదు (2)

కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు

క్షమియించి బ్రోవుము (2)        ||మార్గము||


6.నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి

నాపైబడి ఏడ్చెను

నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి

నన్నూ దీవించెను (2)

నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో

సాక్ష్యమై యుండును (2)                    ||మార్గము||


No comments:

Post a Comment