![]() |
Prema Shaashwatha Kaalamundunu: |
Prema Shaashwatha Kaalamundunu:
ప్రేమ శాశ్వత కాలముండును
ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2)
ప్రేమ విలువను సిలువ జూపె
ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2)
ప్రేమ చూపు నరుల యెడల
ప్రేమ కలిగియుండు ప్రియుడా (ప్రేమ)
1.ప్రేమలో దీర్ఘశాంతము
ప్రేమలో దయాళుత్వము (2)
ప్రేమ సహింప నేర్పును
ప్రేమ కలిగియుండు ప్రియుడా (ప్రేమ)
2.ప్రేమలో డంబముండదు
ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2)
ప్రేమలో తగ్గింపున్నది
ప్రేమ కలిగియుండు ప్రియుడా (ప్రేమ)
3.ప్రేమించు సహోదరుని
ప్రార్ధించు శత్రువుకై (2)
ప్రేమ యేసుని మనస్సు
ప్రేమ కలిగియుండు ప్రియుడా (ప్రేమ)
4.ప్రేమలో సత్యమున్నది
ప్రేమ సంతోషమిచ్చును (2)
ప్రేమయే సమాధానము
ప్రేమ కలిగియుండు ప్రియుడా (ప్రేమ)
5.విశ్వాసము నిరీక్షణ
ప్రేమ ఈ మూడు నిలచున్ (2)
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ యే ప్రేమ (ప్రేమ)
No comments:
Post a Comment