Brathikeda Nee Kosame song lyrics :
బ్రతికెద నీ కోసమే నా ఊపిరి నీ ధ్యానమే
నా జీవితమే నీకంకితమై – (2)
నీదు సేవ జేతు పుణ్యమాని భావింతు
నేను చివర శ్వాస వరకు ||బ్రతికెద||
1.శ్రమయును బాధయు నాకు కలిగినా
వైరులు ఎల్లరు నన్ను చుట్టినా
నీదు న్యాయ శాసనమునే పాటింతు (2)
నాలోని బలము నన్ను విడిచినా
నా కన్ను దృష్టి తప్పిపోయినా (2)
నిన్ను చేరి నీదు శక్తి పొంద
నీదు ఆత్మ తోడ లోక రక్షకా ||బ్రతికెద||
2.వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుట
ఇహమందున యోగ్యమైన కార్యముగా నే తలచి (2)
నీదు రుధిరంబు చేత నేను
కడగబడిన నీదు సొత్తు కాదా (2)
నిన్ను జూప లోకంబులోన
నీదు వెలుగు దీపముగా నాథా ||బ్రతికెద||
No comments:
Post a Comment