Breaking

Thursday, 11 August 2022

Kalalanti brathuku naadhi song lyrics | కలలాంటి బ్రతుకు నాది


 


Kalalanti brathuku naadhi song lyrics : 


కలలాంటి బ్రతుకు నాది

కన్నీటి ఊట నాది (2)

కలలోనైనా ఊహించలేదే

కమనీయమైన ఈ బంధం

కల్వరిలో సిలువ త్యాగ బంధం (2)      ||కలలాంటి||


1.నేనేమిటో నా గతమేమిటో

తెలిసిన వారే క్షమియించలేరే

నా నడకేమిటో పడకేమిటో

ఎరిగిన వారే మన్నించలేరే

హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా

ధన్యునిగా నను మార్చినావే (2)            ||కలలాంటి||


2.నేనేమిటో నా విలువేమిటో

తెలియకనే తిరుగాడినానే

నీవేమిటో నీ ప్రేమేమిటో

ఎరుగక నిను నే ఎదిరించినానే

హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా

దీవెనగా నను మార్చినావే (2)               ||కలలాంటి||









No comments:

Post a Comment