Bandhamu neve snehamu nive song lyrics :
బంధము నీవే స్నేహము నీవే
అతిధివి నీవెనయ్యా ఆప్తుడ నీవెనయ్యా నా యేసయ్యా
ప్రేమించువాడా కృపఁచూపువాడా
నాతోనే ఉండి నను నడుపువాడా
కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు
కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు
మరువని తండ్రివయా నాయేసయ్యా
1.కారు చీకటి నను కమ్ము వేళ
వెలుగు నీవై ఉదయించినావా
నీ ఒడిలో నే నెమ్మదినిచ్చి
కన్నీరు తుడిచావయ్యా
కౌగిల్లో దాచావయ్యా నా యేసయ్యా
2.మూగబోయిన నా గొంతులోన
గానము నీవై నను చేరినావా
హృదయవీణవై మధురగానమై
నాలోనే ఉన్నావయ్యా
నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా
3.యీలోకంలో యాత్రికూడను
ఎవ్వరులేని ఒంటరినయ్యా
నీవె నాకు సర్వము దేవా
చాలును చాలునయా
నీ సన్నిధి చాలునయా నా యేసయ్యా
4.మోడుబారిన నాబ్రతుకులోన
నూతన చిగురును పుట్టించినావా
నీ ప్రేమ నాలో ఉదయించగానే
ఫలియించె నా జీవితం
ఆనందమానందమే నా యేసయ్యా
No comments:
Post a Comment