![]() |
Click on image |
ప్రభువా నీవు మాకిచ్చిన నూతనమైన ఈ దినమును బట్టి నీకు కృతజ్ఞతలు. దేవా ఈ దినమంతా మేము నీకు సమీపంగా ఉంటు నీ సన్నిధి కలిగి జీవించుటకు సహాయం చేయమని నీ రెక్కల నీడలో మమ్ములను భద్రపరచమని వేడుకుంటున్నాము
నాయన నీవు మాతో మాట్లాడుతూ మాకు మార్గాన్ని చూపిస్తూ మేము చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకునేలా సహాయం చేయండి
దేవా మాలో ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులమైన మేము
మేమును శోధింపబడుదు మేమో అని మా విషయమై చూసుకొంటూ సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచిదారికి తీసికొని వచ్చే వారముగా ఉండుటకు కృపచూపమని
ఒకరి భారముల నొకరము భరించి, ఈలాగు నీ నియమమును పూర్తిగా నెర వేర్చే ఆత్మీయత మాలో ప్రతీ ఒక్కరికిని దయచేయమని ప్రార్ధిస్తున్నాము
ఈ రోజంతా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప జేసి
ఆత్మ యందలి ఆనందము మాలో ప్రతీ ఒక్కరికిని దయచేసి నీ పోలికలోకి నీవే మమ్ములను మార్చమని
మహిమ ఘనత ప్రభావములు నీకె ఆరోపిస్తూ
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధిస్తున్నాము తండ్రి ఆమెన్
No comments:
Post a Comment