![]() |
Click on image |
ప్రభువా నీవు మాకిచ్చిన నూతనమైన ఈ దినమును బట్టి నీకు కృతజ్ఞతలు. దేవా ఈ దినమంతా నీవు మాకు తోడుగా ఉండమని మేము కోరుకోవాల్సిన మార్గాన్ని మాకు బోధించి సరైన త్త్రోవలో మమ్ములను నడిపించమని వేడుకుంటున్నాము
అయ్యా మా ఆలోచనలను బట్టి కాకుండా నీ వాక్యాన్ని
బట్టి నడుచుకుంటూ నీ అంగీకారముగా జీవించుటకు మాకు సహాయం చేయండి. దుష్టుడు మాకు వ్యతిరేకంగా పన్నిన ప్రతీ పన్నాగాన్ని లయపరచి ప్రతీ విధమైన కీడు నుండి మమ్ములను తప్పించండి.
మేము ఈ లోక సంబంధులము కాము గనుక లోక సంబంధమైన వాటి మీద మా మనసు పెట్టుకొనకుండ నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుతు
విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతు నిత్యజీవమును చేపట్టుటకు కృప చూపించండి.
ఆశ్చర్యకరమైన నీ వెలుగును మా మీద ప్రసరింజేయండి
మహిమ ప్రభావములతో మమ్ములను దర్శించండి
రోగము వ్యాధి బాధ దుఃఖము వేదన వీటన్నింటిని మాకు దురపరచండి
నీ చిత్తము నీ ఉద్దేశాలు నీ ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చి నీకు మహిమకరముగా మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా మా జీవితాన్ని మర్చి మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ నీవే పొందమని వేడుకుంటు
మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటూ
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధిస్తున్నాము తండ్రి ఆమెన్
No comments:
Post a Comment