Breaking

Friday, 11 March 2022

గలతీయులకు వ్రాసిన పత్రిక (పరిచయం)

 




రచయిత, వ్రాసిన కాలం:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు. క్రీ.శ. 49-58ల మధ్య.


ముఖ్యాంశం:

గలతీయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలలో కొన్నిటిని పౌలు తన రెండో శుభవార్త ప్రచార ప్రయాణంలో స్థాపించాడు (అపొ కా 14వ అధ్యాయం – ఈకొనియ, లుస్త్ర, దెర్బే అనే పట్టణాలు గలతీయ దక్షిణ ప్రదేశంలో ఉన్నాయి). తరువాత క్రీస్తు విశ్వాసులమని చెప్పుకునే కొందరు యూదులు ఈ సంఘాలకు వచ్చి దుర్బోధలు చెప్పి క్రీస్తు శుభవార్తను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. విముక్తి, రక్షణకోసం క్రీస్తుమీది నమ్మకం, దేవుని అనుగ్రహం చాలవనీ, యూద ధర్మశాస్త్ర క్రియలు కూడా చేయాలనేదే వారి తప్పు సిద్ధాంతం. విముక్తి అనేది నమ్మకం ద్వారానే దేవుని కృపవల్లే కలుగుతుందని పౌలు గట్టిగా చెప్పాడు. యూదులకు మూల పురుషుడైన అబ్రాహాము విషయమెత్తి దానిద్వారా ఇతర వాదాలద్వారా ఈ సత్యాన్ని నిరూపించాడు. ఆధ్యాత్మిక సంపూర్ణత, పవిత్ర క్రైస్తవ జీవితం కూడా నమ్మకం ద్వారానే కృపచేతనే అలవడతాయని నొక్కి చెప్పి రుజువు పరిచాడు. ఈ లేఖలోని కొన్ని ముఖ్యమైన మాటలు “నమ్మకం” “నిర్దోషుల లెక్క” “అనుగ్రహం” “కృప” “విడుదల” “సిలువ”. 2:16-21లను మూల వాక్కులు అనవచ్చు.


విషయసూచిక

పరిచయం 1:1-5

శుభవార్తను తారుమారు చేసేవారు 1:6-9

క్రీస్తు రాయబారి పౌలు 1:10—2:21

క్రీస్తే అతనికి శుభవార్తను తెలియజేశాడు 1:11-12

పౌలు పశ్చాత్తాపపడి విశ్వాసిగా అతని మొదటి రోజులు 1:13-24

జెరుసలంలో ఇతర రాయబారులతో పౌలు 2:1-10

అంతియొకయలో పౌలు, పేతురు 2:11-15

పౌలు ఉపదేశించిన సత్యం 2:16-21

విశ్వాసం ద్వారానే రక్షణ 3:1-29

విశ్వాసంద్వారా దేవుని ఆత్మను పొందడం 3:1-5

అబ్రాహాము ఉదాహరణ 3:6-9

ఎవరైనా మోషే ధర్మశాస్త్రం మీద ఆధారపడితే శాపం తగులుతుంది 3:10-12

క్రీస్తు విశ్వాసులను శాపం నుంచి విడిపించాడు 3:13-14

దేవుని వాగ్దానం, ధర్మశాస్త్రం 3:15-25

నమ్మకం ద్వారానే దేవుని సంతానం 3:26-29

ధర్మశాస్త్రం వల్ల దాస్యం, కృప వల్ల విడుదల కలుగుతాయి 4:1-31

దేవుని వారసులు 4:1-7

గలతీయ క్రైస్తవులు బానిసలు కావాలనుకున్నారా? 4:8-16

తప్పుడు బోధకులు, పౌలు కోరిక 4:17-20

హాగరు, శారాల ఉదాహరణ 4:21-31

విశ్వాసులు అనుసరించవలసిన జీవిత విధానం 5:1—6:10

ధర్మశాస్త్రం నుంచి విడుదల 5:1-12

ప్రేమ సిద్ధాంతం 5:13-15

భ్రష్ట స్వభావానికి, దేవుని ఆత్మకు మధ్య సంఘర్షణ 5:16-18

భ్రష్ట స్వభావం చేష్టలు 5:19-21

దేవుని ఆత్మ ఫలం 5:22-26

నిజమైన క్రైస్తవం 6:1-10

పౌలు అతిశయించిన విషయం 6:12-16

ముగింపు మాటలు 6:17-18

No comments:

Post a Comment