రచయిత:
క్రొత్త ఒడంబడిక గ్రంథంలో యాకోబు అనే పేరుగలవారు నలుగురు ఉన్నారు. యోహాను తోబుట్టువూ పన్నెండుగురు శిష్యులలో ఒకడూ అయిన యాకోబు (మత్తయి 10:2). అల్ఫయి కొడుకూ పన్నెండుగురు శిష్యులలో ఒకడూ అయిన యాకోబు (మత్తయి 10:3). పన్నెండుగురు శిష్యులలో ఒకడైన యూదా తండ్రి (లూకా 6:16), ప్రభువైన యేసు తమ్ముడైన యాకోబు (మత్తయి 13:55). యేసు తమ్ముడైన యాకోబు ఈ లేఖ రాశాడు.
వ్రాసిన కాలం:
బహుశా క్రీ.శ. 45-50 మధ్య కాలంలో.
ముఖ్యాంశం:
నమ్మకాన్ని రుజువు చేయడం అనేది ఈ లేఖ ముఖ్యాంశం. నమ్మకం నిజమైనదో కాదో విషమ పరీక్షలవల్ల, దేవుని వాక్కుకు విధేయత విషయంలో, సంఘంలో ప్రవర్తనద్వారా, క్రియలద్వారా నోటి మాటల ద్వారా రుజువు అవుతుంది. ఈ లేఖకు మూల వాక్కు 2:17 అనవచ్చు.
విషయసూచిక
ఈ లేఖ ఎవరికి రాశాడో వారు 1:1
బాధలను, పరీక్షలను ఎదుర్కోవడం 1:2-15
పరీక్షలను ఆనందంతో ఎదుర్కోండి 1:2
పరీక్షలు మంచి ఫలితాలనిస్తాయని తెలుసుకోండి 1:3-4
పరీక్షల విషయంలో జ్ఞానాన్ని ఇమ్మని అడగండి 1:5-8
జీవిత సంగ్రహాన్ని గ్రహించండి 1:9-11
ఓర్పుతో పరీక్షలను ఎదుర్కొనేవాడికి కలిగే బహుమానం 1:12
దేవుడు దుష్ట ప్రేరేపణ చేయడని తెలుసుకోండి 1:13-14
దుష్ట ప్రేరేపణకు లొంగిపోవడం వల్ల వచ్చే ఫలితం 1:15
దేవుడిచ్చే మంచి బహుమానాలు 1:16-18
వినడం, ఆచరించడం 1:19-25
నిజమైన భక్తి 1:19-25
అందరిపట్ల పక్షపాతం లేకుండా వ్యవహరించండి 2:1-13
మంచి పనులను కలిగించని విశ్వాసం ప్రయోజనం లేనిది, నిర్జీవమైనది 2:14-26
నాలుక 3:1-12
రెండు రకాల జ్ఞానం 3:13-18
జగడాలకు పోట్లాటలకు కారణం 4:1-2
ప్రార్థనల్లో దురుద్దేశం 4:3
లోకం దేవునికి వ్యతిరేకం 4:4
దేవునికి లోబడండి 4:5-7
సైతాను పారిపోయేలా చేసే విధానం 4:7
దేవుణ్ణి దగ్గరకు ఎలా తేవాలి 4:8-10
తీర్పు తీర్చడానికి ప్రయత్నించకండి 4:11-12
రేపటి గురించి ఆలోచించకండి 4:13-17
ధనికులకు హెచ్చరిక 5:1-6
కష్టాలలో ఓర్పు కలిగి ఉండడం 5:7-11
ఒట్టుపెట్టుకోవద్దు 5:12
సంతోషంగా, లేక కష్టాలలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి 5:13-16
ప్రార్థనలోని శక్తి 5:17-18
పాపులను దేవునివైపుకు మళ్ళించడం 5:19-20
No comments:
Post a Comment