Breaking

Tuesday, 15 March 2022

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక (పరిచయం)

 



రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు.

వ్రాసిన కాలం:

క్రీ.శ. దాదాపు 60లో.

ముఖ్యాంశాలు:

పౌలు తన రెండో శుభవార్త ప్రచార ప్రయాణంలో ఫిలిప్పీలో ఈ సంఘాన్ని స్థాపించాడు (అపొ కా 16:12-40). ఈ లేఖ ఆ సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు పౌలు శుభవార్తకోసం హింసలకు గురై ఖైదులో ఉన్నాడు. అయినా ఈ లేఖకు మూల పదం ‘ఆనందం’. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నా అతడు క్రుంగిపోలేదు, నిరాశ చెందలేదు, సణుక్కోలేదు. తాను ఆనందిస్తూ ఉన్నానని, వారు ఎప్పుడూ ఆనందించాలని రాస్తూ ఉన్నాడు. ఇందులో మరో ముఖ్యాంశం శుభవార్త ప్రచారం (1:4, 7, 12, 18, 27; 2:15, 22). క్రీస్తు శుభవార్త వ్యాప్తికోసం పౌలు తన సొంత ఉద్దేశాలనూ కోరికలనూ విసర్జించి అన్నిటినీ ఓర్చుకొన్నాడు, తన ఆనందం, సహవాసం, నీతిన్యాయాలు, బలప్రభావాలంతా క్రీస్తులోనే క్రీస్తు శుభవార్తలోనే ఉన్నాయని చెపుతూ ఫిలిప్పీ క్రైస్తవులకూ మనకూ తృప్తికరమైన ఫలభరితమైన జీవిత విధానాన్ని, యేసు క్రీస్తుకు మహిమ చేకూర్చే జీవిత విధానాన్ని వెల్లడి చేశాడు. ఈ లేఖకు మూల వాక్కులు 3:8-10 అనవచ్చు.

విషయసూచిక

ఫిలిప్పీ విశ్వాసులకోసం పౌలు ప్రేమ, ప్రార్థన, కృతజ్ఞతలు 1:3-11

పౌలు ఖైదీ అవడం – శుభవార్త వ్యాపించడానికి మంచి కారణం 1:12-26

మంచి చెడు ఉద్దేశాలు 1:15-18

విడుదల పొందుతానని పౌలు నమ్మకం 1:19,25

బ్రతకడంలో చచ్చిపోవడంలో పౌలు లక్ష్యం 1:20-26

క్రీస్తు శుభవార్తకు తగిన ఆదర్శ జీవిత విధానం 1:27—2:4

యేసు క్రీస్తు – త్యాగానికి గొప్ప ఉదాహరణ 2:5-11

ఆయన దేవత్వం 2:6

ఆయన త్యాగం, విధేయత 2:7-8

ఆయన హెచ్చింపు 2:9-11

వారి విముక్తి సఫలత కోసం పని చేస్తూ ఉండడం 2:12-18

తిమోతి, ఎఫఫ్రోదితస్ 2:19-30

హెచ్చరిక, ప్రోత్సాహం 3:1-2

శరీరంమీద నమ్మకం లేకపోవడం 3:3-7

క్రీస్తుకోసం సమస్తాన్ని సంతోషంగా త్యాగం చేయడం 3:8-11

గురిదగ్గరికి పరుగెత్తడం 3:12-17

రెండు రకాల మనుష్యులు, వారి గమ్యాలు 3:18-21

ఉత్సాహపరచే మాటలు 4:2-9

సమైక్యతను పాటించడం 4:2-3

ఆనందించడం 4:4

సాత్వికంగా ఉండడం 4:5

చింత లేకుండా ప్రార్థన చేయడం 4:6-7

మంచివాటిని తలపోస్తూ ఆచరణలో పెట్టడం 4:8-9

అన్ని పరిస్థితులలోనూ తృప్తిగా ఉండడం 4:10-13

పౌలుకు ఫిలిప్పీవారి బహుమానాలు 4:14-19

ముగింపు మాటలు 4:20-23

No comments:

Post a Comment