Breaking

Sunday, 13 March 2022

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక (పరిచయం)

 



రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు.

వ్రాసిన కాలం:

క్రీ.శ. దాదాపు 60లో.

ముఖ్యాంశాలు:

ఇందులో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి - దేవుని కృపచేత క్రీస్తు విశ్వాసులు పొందిన ఉన్నత ఆధ్యాత్మిక స్థాయి, క్రీస్తు శరీరమనే సంఘాన్ని గురించిన సత్యం, ఇలాంటి స్థాయికీ సత్యానికీ తగిన జీవితం. దేవుని అనుగ్రహం, క్రీస్తు సంఘాన్ని గురించిన సత్యం తెలిసి పౌలు ఎంతో ఆశ్చర్యపడుతూ ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని అనుగ్రహం పాపాలలో ఆత్మసంబంధంగా చచ్చినవారిని క్షమించి, బ్రతికించి, క్రీస్తుతో ఐక్యతలోకి తెచ్చి, చెప్పడానికి వీలు లేనంతగా దీవిస్తుంది. క్రీస్తు నిజమైన సంఘం లోకంలో ఉన్న ఏదో సంస్థ కాదు. అది క్రీస్తు ‘శరీరం’ అనీ, విశ్వాసులంతా దానిలో భాగాలనీ పౌలు దివ్యంగా వివరించాడు. ఈ నిజమైన సంఘంలో దేశ భేదాలు, కులం, వర్ణం, సంస్కృతి భేదాలు అర్థం లేనివి. ఇలాంటి అడ్డులను క్రీస్తు తన సిలువమీద పడగొట్టాడు. క్రీస్తులో సమైక్యత, నిజమైన సోదరత్వం ఉన్నాయి. ఈ లేఖలోని కొన్ని ముఖ్యమైన మాటలు ‘క్రీస్తులో’ ‘పరమ స్థలాలలో’ ‘ఐశ్వర్యం’ ‘ఒక్కటిగా’ ‘సమైక్యత’ ‘కృప’. మూల వాక్కులు 1:3-4 అనవచ్చు.

విషయసూచిక

ముందు మాట 1:1-2

క్రీస్తులో విశ్వాసుల స్థాయి 1:3—2:22

వారికి సమస్త ఆధ్యాత్మిక ఆశీస్సులున్నాయి 1:3

వారిని దేవుడు ఎన్నుకొన్నాడు 1:4-6

వారికి పాపక్షమాపణ ఉంది 1:7

వారికి దేవుని రహస్య సత్యం ఉంది 1:8-10

వారికి దేవుని వారసత్వం ఉంది 1:11-12

వారికి దేవుని పవిత్రాత్మ ఉన్నాడు 1:13-14

క్రీస్తులో తమ స్థానాన్ని విశ్వాసులు తెలుసుకోవాలని పౌలు ప్రార్థన 1:15-21

క్రీస్తు వారికి తలగా ఉండి వారు క్రీస్తు శరీరం అయ్యారు 1:22-23

వారు క్రీస్తులో సజీవులు 2:1-5

వారు ఆయనతో పాటు పరమ స్థలాలలో కూర్చున్నారు 2:6

వారికి మహిమాన్విత భవిష్యత్తు ఉంది 2:7

వారు దేవుని చేతి పనులు 2:8-10

వారు దేవునికి సమీపస్తులై ఆయన సన్నిధానంలోకి వెళ్ళే అవకాశం గలవారు 2:11-18

వారు పరలోక పౌరులై దేవుని కుటుంబంలో సభ్యులయ్యారు 2:19

వారు దేవుని పవిత్ర ఆలయం 2:20-22

ఇతర జనాల కోసం క్రీస్తు రాయబారి పౌలు 3:1-13

దేవుని రహస్య సత్యాన్ని వెల్లడి చేశాడు 3:1-7

పవిత్రులందరిలోనూ అత్యంత అల్పుడు 3:8

దేవుని ఉద్దేశం 3:10-11

క్రీస్తు ప్రేమనూ, దేవుని సంపూర్ణత్వాన్నీ వారు అనుభవించాలని పౌలు ప్రార్థన 3:14-21

క్రీస్తులో వారి స్థాయిని బట్టి విశ్వాసులు ప్రవర్తించవలసిన విధానం 4:1—6:9

క్రీస్తులో ఐక్యత 4:1-6

విశ్వాసులను సేవకోసం సిద్ధపరచడం 4:7-12

క్రీస్తులో ఎదగడం 4:13-16

పాత జీవితాన్ని వదలి క్రొత్త జీవితాన్ని అనుసరించడం 4:17-32

దేవుణ్ణి అనుసరించడం 5:1-7

వెలుగు సంతానం 5:8-17

దేవుని ఆత్మతో నిండి ఉండడం 5:18-21

భార్యలు, భర్తలు, క్రీస్తు, ఆయన సంఘం 5:22-32

తల్లిదండ్రులు, పిల్లలు 6:1-4

యజమానులు, దాసులు 6:5-9

ఆధ్యాత్మిక యుద్ధాన్ని విశ్వాసులు ఎలా పోరాడాలి 6:10-20

ముగింపు మాటలు 6:21-24.

No comments:

Post a Comment