Breaking

Monday, 14 February 2022

హగ్గయి (పరిచయం)

 




రచయిత:

ఎజ్రా 5:1-2; 6:14 లో ఉన్న హగ్గయి ప్రవక్త.


వ్రాసిన కాలం:

క్రీ. పూ. సుమారు 520. పారసీకుల చక్రవర్తి దర్యావేషు పరిపాలన రెండో సంవత్సరంలో.


ముఖ్యాంశాలు:

కోరెషు పరిపాలన రెండవ సంవత్సరంలో యూదులు జెరుసలంకు తిరిగి వెళ్లిపోవచ్చని ఆజ్ఞ అయింది (క్రీ.పూ.538). వెంటనే కొంత మంది తిరిగి వెళ్ళి జెరుబ్బాబెల్ నాయకత్వంలో దేవాలయ పునర్నిర్మాణం మొదలుపెట్టారు గాని పునాదులవరకు కట్టి పని మానుకున్నారు. దేవాలయం నిర్మాణానికి యూదుల్ని పురిగొల్పాడు హగ్గయి. దేవుని కార్యం పట్ల అవిధేయత చూపుతున్నందువల్ల కలుగుతున్న నష్టాలనూ విధేయత చూపితే ఒనగూడే దీవెనలనూ వివరించాడు. నాయకుడైన జెరుబ్బాబెల్‌కు ఆలయ నిర్మాణాన్ని గురించిన వాగ్దానం, ప్రోత్సాహం ఇందులో ఉన్నాయి.


విషయసూచిక:

హగ్గయిప్రవక్త భవిష్యద్వాక్కులు పలికిన సందర్భం 1:1

ఆలయ నిర్మాణం విషయంలో ప్రజలు చెప్తున్న సాకు,

నిర్లక్ష్యం చేసినందువల్ల వాటిల్లుతున్న నష్టాలు 1:2-11

ప్రజలకు భయభక్తులు కలగడం 1:12

దేవుని వాగ్దానం, పని తిరిగి ప్రారంభం 1:13-15

నాయకులకు దేవుడు ధైర్యం చెప్పడం 2:1-5

అభిషిక్తుని రాక గురించీ ఆలయం వైభవకరం కావడం గురించి వాగ్దానం 2:6-9

ప్రజల పాపపూరితమైన ప్రయత్నాలన్నీ అపవిత్రత కలిగిస్తాయి 2:10-14

ప్రజల కష్టార్జితమంతా వ్యర్దమైపోతూ ఉండడం 2:15-19

ఇతర రాజ్యాలపై దేవుని తీర్పు 2:20-22

జెరుబ్బాబెల్‌కు ధన్యకరమైన వాగ్దానం 2:23

No comments:

Post a Comment