స్తుతిఘన మహిమలు నీకే నా మంచి యేసు నీకే
ఆరాధన స్తోత్ర గీతం చెల్లింతును నే నిరతం
నా బంధం నీవే నా బలము నీవే
నా ధనము నీవే -నా సర్వం నీవే
1. జీవమిచ్చావు నీకే నా స్తోత్రం
జీవింపచేసావు నీకే నా స్తోత్రం (2)
జీవజలములతో దాహము తీర్చావు
జీవమర్గమై నా గమ్యం చూపావు(2)
2. ప్రేమపంచావు నీకే నా స్తోత్రం
పాప పరిహారమిచ్చావు నీకే నా స్తోత్రం (2)
ప్రార్థనలన్నిటికి జవాబునిచ్చావు
పరిశుద్ధాత్మతో అభిషేకించావు (2)
3. ఆదరించావు నీకే నా స్తోత్రం
ఆశీర్వదించావు నీకే నా స్తోత్రం (2)
ఆపత్కాలమున అశ్రయమైనావు
అన్నివేళాల నాతో ఉన్నావు (2)
No comments:
Post a Comment