Breaking

Wednesday, 19 January 2022

ఇదిగో దేవా నా జీవితం | idigo deva na jivitam song lyrics


 



ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకంకితం

శరణం నీ చరణం శరణం నీ చరణం (2)


1. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి

విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి

అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు

అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం


2. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు

నీ హృదయ భారంబు నొసగి ప్రార్ధించి పనిచేయనిమ్ము

ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగ పని చేయనిమ్ము

ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము


3. విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయనిమ్ము

కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరినాకు నొసగు

క్షేమక్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా

నశియించు ఆత్మలన్ నీదరి చేర్చు కృపనిమ్మయా









No comments:

Post a Comment