రచయిత:
“యోనా” అంటే గువ్వ. 2 రాజులు 14:25లో ఇతడి ప్రస్తావన ఉంది. జెబూలూను ప్రాంతంలోని గాత్ హెఫెరు ఇతడి స్వగ్రామం.
వ్రాసిన కాలం:
సుమారు క్రీ.పూ. 760.
ముఖ్యాంశం:
దేవుని కరుణ, జాలి ఇస్రాయేల్ వారికే గాక అన్నిజాతులవారిపైనా ఉంది. అయితే ఆ జాతులు పశ్చాత్తాపపడాలి. ఇస్రాయేల్‌వారి విధి ఏమిటంటే దేవుని ప్రేమ, క్షమాగుణం గురించి ఇతరులకు సాక్ష్యమిచ్చి, వారు తమ చెడుగును మాని యెహోవా వైపుకు తిరిగేలా చెయ్యాలి. ఒక విషయంలో యోనా యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు (మత్తయి 12:39-40).
విషయసూచిక:
యోనాకు దేవుని పిలుపు, అతని పలాయనం 1:1-3
తుఫాను 1:4-7
యోనా తానెవరో ఒప్పుకోవడం 1:8-12
యోనా, బ్రహ్మాండమైన చేప 1:13-17
చేప కడుపులోనుండి యోనా ప్రార్థన 2:1-10
నీనెవెలో యోనా ప్రకటించడం 3:1-5
రాజు పశ్చాత్తాపం, జాతీయ పశ్చాత్తాపాన్ని ప్రకటించడం 3:6-9
దేవుడు నీనెవెను క్షమించడం 3:10
దేవుని కరుణనుబట్టి యోనా కోపం 4:1-4
సొరచెట్టు, పురుగు 4:5-8
యోనాను దేవుడు మందలించడం 4:9-11
No comments:
Post a Comment