Breaking

Thursday, 2 December 2021

Evaru samipinchaleni song lyrics | ఎవరూ సమీపించలేని


 


ఎవరూ సమీపించలేని

తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)

నీ మహిమను ధరించిన పరిశుద్ధులు

నా కంటబడగానే (2)

ఏమౌదునో నేనేమౌదునో (2)


1.ఇహలోక బంధాలు మరచి

నీ యెదుటే నేను నిలిచి (2)

నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి

నిత్యానందముతో పరవశించు వేళ (2)     ||ఏమౌదునో||


2.పరలోక మహిమను తలచి

నీ పాద పద్మములపై ఒరిగి (2)

పరలోక సైన్య సమూహాలతో కలసి

నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)    ||ఏమౌదునో||


3.జయించిన వారితో కలిసి

నీ సింహాసనము నే చేరగా (2)

ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో

నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2)  ||ఏమౌదునో||



No comments:

Post a Comment