Breaking

Wednesday, 8 December 2021

కీర్తనలు (పరిచయం)

 




రచయిత:

చాలా కీర్తనలకు రచయితను గురించి క్లుప్త పరిచయం ఉన్నది. కీర్తన ఎవరిని ఉద్దేశించి లేక ఎవరికోసం వ్రాసినది, ముఖ్యాంశమేమిటి అనే దానిని మొదటిలోనే వ్రాయడం జరిగింది. ఈ పరిచయ మాటలను బట్టి దావీదు 70 కీర్తనలను, ఆసాపు 12 కీర్తనలను, సొలొమోను 2 కీర్తనలను, మోషే ఏతానులు ఒక్కొక్క కీర్తనను, కోరహు కుమారులు 11 కీర్తనలను (42వ కీర్తనకు వ్రాసిన పరిచయ పీఠికను చూడండి) వ్రాసినట్లు తెలుస్తుంది. అంటే మిగిలిన 50 కీర్తనలను ఎవరు వ్రాసినట్లు సూచించలేదు. వీటిలో కొన్ని దావీదే వ్రాసి ఉండవచ్చు (అలాగని గ్రీకు పాత ఒడంబడికను హీబ్రూ భాషలోకి) అనువదించిన వారు నమ్మి మరో 15 కీర్తనలకు దావీదు పేరును పరిచయ మాటలలో చేర్చారు. అలాగే మరికొన్ని కీర్తనల పరిచయ మాటలలో హగ్గయి, జెకర్యా పేర్లను చేర్చారు.

వ్రాసిన కాలం:

దావీదు క్రీ.పూ. 1010-970 మధ్య రాజ్యపాలన చేసాడు. అతడు కొన్ని కీర్తనలను రాజు కాకముందు, మరికొన్నింటిని తరువాత వ్రాశాడు. మోషే ఇస్రాయేల్‌ప్రజలతో 1446-1406 మధ్య అరణ్య ప్రాంతాలలో గడిపాడు. అప్పుడే కీర్తనను లేక కీర్తనలను వ్రాసి ఉంటాడు. కొన్ని కీర్తనలు బహుశా ఇస్రాయేల్ బబులోను చెరలోనికి క్రీ.పూ. 600 దరిదాపులలో వెళ్ళిన తరువాత వ్రాసినవి కావచ్చు. ఉదాహరణకు కీర్తన 137ను చూడండి. ఆ రీతిగా కీర్తనలలో చాలా మట్టుకు దావీదు వ్రాసినవే అయినా మొత్తంమీద కీర్తనలన్నీ వ్రాయడానికి పట్టిన కాల వ్యవధి సుమారు 1000 సంవత్సరాలు.

ముఖ్యాంశాలు:

కీర్తనలలో అనేక ముఖ్యాంశాలున్నాయి. ఎందుకంటే అనేక రకాల మానవ అనుభవాల పరిస్థితులలో నుండి వ్రాయడం జరిగింది. ఈ కారణం చేత కీర్తనలలో ప్రతి కీర్తన విశ్వాసులు ఎదుర్కొనే ఏదో రకం పరిస్థితికో సందర్భానికో అన్వయించుకోవడానికి అనువుగా ఉంటుంది. కీర్తనలలో చాలా మట్టుకు ఏకైక నిజ దేవుడైన యెహోవాకు చేసే ప్రార్థనలు లేక స్తుతులు ప్రధానాంశంగా ఉన్నాయి. కొన్ని కీర్తనలు దేవుని మహాత్యం గురించి తెలియజేసే ధ్యానికలు. లేదంటే దేవుడు తన ప్రజల పట్ల లేక శత్రువుల పట్ల ఎలా వ్యవహరిస్తాడో తెలియజేస్తాయి. కొన్ని కీర్తనలు యెహోవాను గురించి లేక ఆయన పట్టణం గురించి లేక భూమిమీద ఆయన ఏలుబడిని గురించి వ్రాసినవి. కొన్ని కీర్తనలు ఇతరులను దేవుని స్తుతించడానికి హెచ్చరించే మాటలతో నిండి ఉన్నాయి. కీర్తనలలో అనేక ముఖ్యాంశాలు ఉండడం చేత సరియైన విభాగాలుగా కీర్తనలను విభజించడం వీలుపడదు. దిగువ ఇచ్చిన విభజన పాఠకులకు కొంత వరకు సహాయపడవచ్చు.

దైవ స్తుతి లేక కృతజ్ఞత కీర్తనలు

9, 18, 21, 65, 68, 75, 76, 84, 89, 92, 103 - 108, 116, 135, 145.

దేవుని స్తుతించుమని ఇతరులను హెచ్చరించే కీర్తనలు

29, 33, 47, 66, 68, 81, 95-100, 113, 117, 118, 134-136, 146-150

దేవుని మహాత్యం లేక మంచితనం గురించి తెలియజేసే కీర్తనలు

2, 8, 18, 19, 23, 24, 29, 33, 34, 37, 45-48, 50, 65, 66, 68, 76, 77, 85, 86, 89-91, 93, 95-100, 102-104, 107, 111, 113, 115, 116, 118, 121, 135, 136, 138, 139, 145-147.

దేవుణ్ణి రాజుగాను తీర్పరిగాను వివరించే కీర్తనలు

2, 7, 9, 10, 11, 24, 29, 44, 45, 47, 48, 50, 68, 74, 75, 80, 82, 84, 93, 94-99, 102, 113, 132, 145, 146.

అక్కరలో ఉన్నప్పుడు సహాయాన్నందించే ప్రార్థనలు గల కీర్తనలు

3-7, 9, 10, 12, 13, 16, 17, 22, 25-28, 31, 35, 38-41, 43, 44, 51, 54-57, 59, 61, 64, 69-71, 74, 79, 80, 83, 85, 86, 88, 90, 94, 102, 109, 109, 120, 123, 130, 140-144.

దేవునిలో దృఢ విశ్వాసాన్నీ నమ్మకాన్నీ వ్యక్తం చేసే కీర్తనలు

1, 3-5, 11, 13, 16-18, 20, 21, 23, 27, 28, 31, 34, 37, 40, 41, 46, 54-56, 62, 84, 86, 91, 103, 115, 116, 118, 121, 124, 125, 130, 135, 139, 140, 145

రచయిత పాపం లేక పాపక్షమాపణను గురించి తెలియజేసే కీర్తనలు

25, 32, 38, 39, 40, 41, 51, 65, 73, 78, 79, 86, 89, 90, 99, 103, 106, 107,119,130

కృంగిన వారి కోసం కీర్తనలు

13, 23, 25, 32, 37, 42, 43, 62, 73, 77, 91, 103, 107, 121.

దేవునితో సహవాసాన్ని పొందడంకోసం ఆశను వ్యక్తం చేసే కీర్తనలు

27, 42, 61, 63, 84, 119, 143.

దుష్ట శత్రువులను దేవుడు శిక్షిస్తాడని ప్రార్థన రూపంలో వ్రాసిన కీర్తనలు

7, 17, 35, 55, 59, 69, 109, 137, 139.

చరిత్రను తిరిగి గుర్తుచేయడానికి వ్రాసిన కీర్తనలు

68, 78, 81, 105, 106, 114, 135, 136.

ఉపదేశించడానికి అనుగుణమైన కీర్తనలు (ఒక విధంగా చూస్తే నిర్ధిష్టమైన ఉద్దేశంతో వ్రాసినవైనా, లేక అలాంటి ఉద్దేశం లేకపోయినా గాని అన్ని కీర్తనలు ఉపదేశం కోసం తగినవే)

1, 2, 14, 15, 19, 24, 32, 33, 34, 37, 46, 49, 53, 73, 78, 91, 103-108, 110-113, 115, 119, 121, 122, 125-128, 133, 135, 136.

యాత్రికులను ఉద్దేశించిన కీర్తనలు

84, 120-134.

దేవుని వాక్కును కొనియాడే కీర్తనలు

12, 19, 119, 138.

యేసు క్రీస్తును సూచించే భవిష్యత్ వాక్కులు గల కీర్తనలు

2, 8, 16, 22, 40, 41, 45, 68, 69, 89, 102, 110, 118

విషయసూచిక

కీర్తనలు ఐదు భాగాలుగా విభజించడం జరిగింది. విభజనను క్రింద ఇచ్చాం. కొన్ని (అన్నీ కాదు) ప్రసిద్ధి గాంచిన అతి ప్రియమైన కీర్తనల ఆరంభ మాటలను ఒక పట్టీలో ఇచ్చాము. అంతేగాక మనం ప్రార్థించేటప్పుడు వాడదగిన కొన్ని ప్రార్థనలను, అమూల్యమైన వాగ్దానాలను కూడా పట్టీలో ఇచ్చాము. దేవుణ్ణి స్తుతించడానికి అనేక కారణాలను కీర్తనలు తెలియజేస్తున్నాయి. వాటిలో కొన్నిటిని కూడా చేర్చాము.

మొదటి భాగం – కీర్తనలు 1-41

కీర్తన 1 – “దుర్మార్గుల సలహా ప్రకారం నడవకుండా”

కీర్తన 2 – “ప్రజలు అల్లరి చేస్తున్నారెందుకని”

కీర్తన 8 – “యెహోవా! మా ప్రభూ! భూలోకమంతట్లో నీ పేరు ఎంత ఘనమైనది!”

కీర్తన 14 – “దేవుడు లేడంటూ మూర్ఖులు తలపోస్తారు”

కీర్తన 16 – “దేవా! నిన్ను నమ్మి ఆశ్రయించాను. నన్ను కాపాడు”

కీర్తన 18 – “యెహోవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవే నా బలం”

కీర్తన 19 – “ఆకాశాలు దేవుని మహిమను గురించి చెపుతున్నాయి”

కీర్తన 22 – “నా దేవా! నా దేవా! నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు”

కీర్తన 23 – “నా కాపరి యెహోవా”

కీర్తన 32 – “దేవుడు ఎవరి అతిక్రమాలను క్షమించాడో, ఎవరి పాపాలను కప్పివేశాడో వారు ధన్యజీవులు”

కీర్తన 37 – “దుర్మార్గులను గురించి కంగారుపడకు”

కీర్తన 40 – “యెహోవా కోసం నేను ఓర్పుతో ఎదురుచూశాను”

వాగ్దానాలు, ఆదర్శ ప్రార్థనలు

1:3; 5:8, 12; 6:1; 9:9-10:17-18; 11:7; 16:1, 11; 17:7; 18:1-2, 30; 19:12-14; 23:1-6; 25:4-5, 8-12, 14, 18; 27:4-5, 10, 11; 29:11; 30:5; 31:3, 19, 20; 32:1-2; 33:4; 34:7-10, 15, 17-19, 22; 36:5-10; 37:4-6, 23-25, 28, 29; 38:1; 39:4, 8; 40:4-5; 41:1, 4.

దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలు తెలియజేసే కారణాలు

7:17; 8:1-9; 9:1; 13:6; 16:7; 18:46-50; 21:13; 22:22-26; 28:6-7; 30:4-5, 11, 12; 31:21; 33:1-5; 34:1-4; 40:1-3

రెండో భాగం – కీర్తనలు 42-72

కీర్తన 42 – “దుప్పి నీటి ధారలకోసం తహతహ లాడుతూ”

కీర్తన 45 – “నా హృదయం ఓ మంచి విషయంతో పొంగిపొర్లిపోతూవుంది.”

కీర్తన 46 – “దేవుడు మనకు ఆశ్రయం, బలం”

కీర్తన 47 – “సర్వలోక ప్రజలారా, చప్పట్లు కొట్టండి”

కీర్తన 50 – “దేవుడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు”

కీర్తన 51 – “దేవా, నీ అనుగ్రహం ప్రకారం నన్ను కరుణించు”

కీర్తన 66 – “సర్వలోక ప్రజలారా! దేవుణ్ణి గురించి ఆనంద ధ్వనులతో పాడండి”

కీర్తన 69 – “దేవా, నన్ను రక్షించు!”

కీర్తన 72 – “దేవా, రాజుకు నీ న్యాయ నిర్ణయాలు ప్రసాదించు”

వాగ్దానాలు, ఆదర్శ ప్రార్థనలు

43:3; 46:1, 7; 47:8; 48:14; 50:15; 51:1-2, 7-12; 55:22; 57:1, 5; 62:11-12; 65:2-3; 67:1-3; 68:3-6; 69:32-33; 72:18-19.

దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలు ఇచ్చే కారణాలు

47:7-8; 51:14-15; 52:9; 56:12-13; 57:9-10; 59:16-17; 61:7-8; 63:3-4; 66:1-3, 8-12, 20; 67:3-4; 68:4-6, 19, 20, 32-35; 69:34-36; 71:5-8, 14-16, 22, 23; 72:18.

మూడో భాగం – కీర్తనలు 73-89

కీర్తన 73 – “ఇస్రాయేల్ ప్రజలపట్ల, శుద్ధ హృదయంగలవారిపట్ల దేవుడు మంచివాడు”

కీర్తన 78 – “నా ప్రజలారా, నా ఉపదేశం చెవిని పెట్టండి”

కీర్తన 84 – “సేనలప్రభువైన యెహోవా! నీ నివాస స్థలాలు ఎంత ప్రియమైనవి”

కీర్తన 87 – “పవిత్ర పర్వతాల పై ఆయన తన పునాది వేశాడు”

కీర్తన 89 – “యెహోవా కరుణా క్రియలు నేను ఎప్పుడూ సంకీర్తనం చేస్తాను”

వాగ్దానాలు, ఆదర్శ ప్రార్థనలు 73:26; 74:22; 80:3,18; 81:10; 83:1; 84:5,11; 85:6-7; 86:4-5,11; 89:8

దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలు ఇచ్చే కారణాలు 75:1; 84:4,11; 86:12-13; 89:5-8

నాలుగో భాగం – కీర్తనలు 90-106

కీర్తన 90 – “ప్రభూ! తరతరాలుగా నీవు మాకు నివాస స్థానం”

కీర్తన 91 – “సర్వాతీతుని చాటున నివసించేవారు అమిత బలాఢ్యుని నీడలోనే విశ్రమించేవారు”

కీర్తన 95 – “రండి, యెహోవా సంకీర్తనం ఉత్సాహంతో చేద్దాం పట్టండి”

కీర్తన 96 – “యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి”

కీర్తన 103 – “నా మనసా, యెహోవాను కీర్తించు”

వాగ్దానాలు, ఆదర్శ ప్రార్థనలు 90:13-17; 91:3-16; 92:12-15; 94:14; 97:10-11; 102:17; 103:11-14.

దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలిచ్చే కారణాలు

92:1-5; 95:1-3; 96:1-6; 98:1, 9; 99:2-3, 9; 100:4-5; 101:1; 103:1-22; 104:1; 105:1-2; 106:1.

అయిదో భాగం – కీర్తనలు 107-150

కీర్తన 107 – “యెహోవాకు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆయన మంచివాడు”

కీర్తన 109 – “నా స్తుతికి పాత్రుడవైన దేవా! మౌనం వహించకు”

కీర్తన 110 – “యెహోవా నా ప్రభువుతో పలికిన వాక్కు”

కీర్తన 115 – “యెహోవా, నీ అనుగ్రహాన్ని బట్టీ సత్యాన్ని బట్టీ నీ పేరుకే ఘనత చేకూరాలి”

కీర్తన 118 – “యెహోవా మంచివాడు, ఆయన అనుగ్రహం శాశ్వతంగా నిలిచి ఉంటుంది”

కీర్తన 119 – “యెహోవా ఉపదేశం అనుసరించి నిర్దోషంగా నడుచుకొనేవారు ధన్య జీవులు”

కీర్తన 121 – “కొండలవైపు నా తలెత్తి చూస్తాను”

కీర్తన 126 – “యెహోవా సీయోను నగరవాసులను చెరనుంచి తిరిగి తెచ్చినప్పుడు”

కీర్తన 133 – “సోదరులు సమైక్యతతో ఉండడం ఎంత మంచిది! ఎంత మనోహరమైనది!”

కీర్తన 136 – “యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు అర్పించండి”

కీర్తన 139 – “యెహోవా, నీవు నన్ను బాగా పరిశోధించావు”

కీర్తన 145 – “నా దేవా, నా రాజా, నిన్ను ఘనపరుస్తాను”

కీర్తన 150 – “యెహోవాను స్తుతించండి”

వాగ్దానాలు, ఆదర్శ ప్రార్థనలు

108:5-6; 112:1; 115:1, 13; 116:5, 15; 119:9, 12, 17-19, 29, 33-38, 65, 66, 73, 76, 77, 124, 130, 133, 135, 153, 156, 160, 169, 170, 176; 120:2; 121:3-8; 125:1-2; 126:6; 130:4; 138:6; 139:17, 23, 24; 141:3-4, 9; 143:1-2; 145:8-9, 13, 14, 17-20; 146:5-6; 147:3, 11; 149:4.

దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలు ఇచ్చే కారణాలు

107:1; 108:3-4; 109:30-31; 111:1-10; 117:1-2; 118:1; 119:164; 171; 124:6-7; 135:3-4; 136:1; 138:1-3; 139:14; 144:1-2; 145:1-23; 46:1-10;147:1-20; 148:5-6, 13, 14; 149:1-9.

1 comment: