Breaking

Saturday, 25 December 2021

సామెతలు ( పరిచయం)

 





రచయిత:

ఈ పుస్తకంలో సామెతలను చాలామట్టుకు సొలొమోను రాశాడు. వేరేవాళ్ళు కూడా కొన్ని సామెతలు రాశారు. చూడండి 22:17; 24:23; 30:1; 31:1.

వ్రాసిన కాలం:

సొలొమోను క్రీ.పూ. 970-930 మధ్య రాజ్యపాలన చేశాడు. అందుచేత చాలామట్టుకు ఈ సామెతలన్నీ ఆ కాలంలో రాసినవే అయివుండాలి.

ముఖ్యాంశం:

సొలొమోను స్వయంగా ఈ సామెతలను ఎందుకు రాశాడో కారణం తెలియజేశాడు అందుచేత అదే వీటి ముఖ్యాంశం. చూడండి 1:2-6. ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎదురయ్యే అనేక రకాల పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో ప్రజలు తెలుసుకోవాలని అతడు ఆశించాడు. 1:7లో మరో ముఖ్యాంశాన్ని సూచించాడు – అది దేవునిపట్ల భయభక్తి. ఈ పుస్తకమంతటిలో జ్ఞానంగలవారికి జ్ఞానంలేనివారికి మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరించడమైంది. జ్ఞానంగలవారు దేవుని భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో నడుస్తారు. జ్ఞానంలేనివారైతే దేవునికి భయపడక వారి స్వంత మార్గాల్లో నడుస్తారు. యథార్థమైన జ్ఞానం నీతి న్యాయాల అనుసరణలో ఫలిస్తుంది. జ్ఞానం లేకపోవడం పాపానికి దారి తీస్తుంది. ఒక విధంగా చూస్తే దుర్మార్గమే జ్ఞానహీనత అనీ జ్ఞానమే నీతిన్యాయాలు అనీ మనం చెప్పుకోవచ్చు.

విషయసూచిక

ప్రయోజనాలు విషయ సంగ్రహం 1:1-7

దుర్మార్గులకు దూరంగా ఉండాలని హెచ్చరికలు 1:8-19

జ్ఞానమందించు పిలుపు, ప్రమాదం గురించి హెచ్చరికలు 1:20-33

వెతకవలసిన చోట వెతికితే జ్ఞానం దొరుకుతుంది 2:1-8

జ్ఞానం వల్ల వచ్చే లాభాలు 2:9—3:2

వివేచనగల మార్గంలో ఎలా నడవాలి 3:3-12

జ్ఞానం బంగారంకంటే విలువైనది 3:13-18

జ్ఞానంవల్ల వచ్చే మరికొన్ని లాభాలు 3:21-26

ఇతరులతో జ్ఞానయుక్తమైన ప్రవర్తన 3:27-32

దేవుని శాపం 3:33-35

సర్వోత్తమమైన జ్ఞానాన్ని పొందడానికి ఉపదేశం 4:1-27

వ్యభిచారానికి దూరంగా ఉండడానికి ఉపదేశం 5:1-23

మూర్ఖత, సోమరితనం గురించి హెచ్చరికలు 6:1-15

దేవుడు ద్వేషించే ఏడు విషయాలు 6:16-19

వ్యభిచారానికి దూరంగా ఉండడానికి మరికొన్ని ఉపదేశాలు 6:20—7:27

జ్ఞానం మరో సారి పిలుస్తుంది 8:1-20

జ్ఞానం చిరకాలం ఉంటుంది 8:21-31

జీవం, మరణం 8:32-36

మనుషులకు జ్ఞానమందించే పిలుపు 9:1-12

మందబుద్ధి కూడా పిలుపునందిస్తుంది 9:13-18

అనేక విషయాల గురించి సామెతలు 10:1—22:16

జ్ఞానం గలవారి గురించి సామెతలు 10:1,8,19; 11:30; 13:1,14; 14:1,16; 15:7,24

న్యాయవంతుల గురించి సామెతలు 10:6,11,20,21,25,28,29-32; 11:19,23,30; 12:21; 13:5,9; 14:32; 15:29; 18:10; 20:7

మూర్ఖుల గురించి సామెతలు 10:18,23; 12:15; 13:19; 14:8-9; 15:2,5; 17:10,12; 18:2.

దుర్మార్గుల గురించి సామెతలు 10:7,16,32; 11:7,21,23; 12:5,10,26; 15:8-9,28,29; 16:4; 17:23; 21:4,27

మరికొన్ని మేలుకొలిపే సామెతలు 11:2,20; 12:1,22,28; 14:2,12,26,27,31,34; 15:4,32; 16:2-3,4,5,8,9,16,18; 17:1,9,22; 18:9,19,21; 19:3,5,8,11,17,21,24; 20:27; 21:1,3,6,30; 22:6,13; 22:6,13

జ్ఞానోక్తులు 22:17—24:34

కొన్ని మేలుకొలిపే సామెతలు 23:13-14,26; 24:1,16,19,20,30-34

మరికొన్ని సొలొమోను సామెతలు 25:1—29:27

కొన్ని మేలుకొలిపే సామెతలు 25:21-22,28; 26:11,15,17,27; 27:1,17,20,21; 28:1,13,14; 29:1,5

ఆగూరు రాసిన జ్ఞానోక్తులు 30:1-33

లెమూయేలురాజు రాసిన జ్ఞానోక్తులు 31:1-9

గుణవతియైన భార్య వివరణ 31:10-31


No comments:

Post a Comment