Breaking

Thursday, 2 December 2021

ఎస్తేరు ( పరిచయం )

 



పేరు:

“ఎస్తేరు” అనే పేరు పారసీక భాషనుంచి వచ్చింది. దానికి అర్థం “నక్షత్రం”.


రచయిత:

తెలియదు.


వ్రాసిన కాలం:

సుమారు క్రీ.పూ. 460-333 మధ్య.


ముఖ్యాంశం:

పారసీక దేశంలో చెరలో ఉన్న యూదులకు వచ్చిన అపాయం; దేవుడు మొర్‌దెకయి ఎస్తేరుల ద్వారా యూదులను అపాయంలోనుండి తప్పించడం; యూదులను నాశనం చేయాలని పన్నాగం వేసిన వారి పతనం. ఈ పుస్తకంలోని విశేషమేమంటే దేవుని గురించిన ప్రసక్తి ఎక్కడా లేదు. అయితే పరిస్థితుల వెనుక ఉండి తన సంకల్పాలను దేవుడు నెరవేరుస్తున్నాడన్న సంగతిని రచయిత గుర్తించినట్లు స్పష్టమౌతుంది. ఉదాహరణకు చూడండి 4:12-17. దుష్ట శత్రువుల పట్ల దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో అనేదానికి హామాను కథ అంటే అతడు పలుకుబడిలో పెరగడం ఆ తరువాత పడిపోవడం అనేది మంచి సాదృశ్యంగా ఉంది. చూడండి ద్వితీ 32:35; కీర్తన 7:15-17; 9:16; 18:25-27; 37:34-36.



విషయసూచిక

వష్తిరాణి పతనం 1:1-22

రాజు కోసం రాణిగా ఉండగల కన్యను వెదకడం 2:1-18

మొర్‌దెకయి పరిచయం 2:5-11

ఎస్తేరు క్రొత్త రాణి అయింది 2:5-18

మొర్‌దెకయి రాజుకు విరుద్ధంగా జరుగుతున్న పన్నాగాన్ని గుర్తించడం 2:19-23

యూదులను చంపడానికి హామాను చేసిన పన్నాగం 3:1-15

హామానును ఓడించడానికి సహాయం చేయమని మొర్‌దెకయి ఎస్తేరును కోరాడు 4:1-17

రాజుకు ఎస్తేరు విన్నపాలు 5:1—9:17

మొదటి విన్నపం 5:1-6

రెండో విన్నపం 5:7-8

హామాను సంతోషం, కోపం, ప్రగల్భం,

మొర్‌దెకయిని చంపించడానికి ఏర్పాటు 5:9-14

రాజు మొర్‌దెకయిని సన్మానించాడు 6:1-14

రాజుకు ఎస్తేరు చేసిన మూడో విన్నపం 7:1-6

హామాను పై దేవుని శిక్ష 7:7-10

అతి ఉన్నతమైన స్థానాన్ని రాజు మొర్‌దెకయికి ఇచ్చాడు 8:1-2

రాజుకు ఎస్తేరు చేసిన మరో విన్నపం 8:3-6

యూదులకోసం రాజు శాసనం 8:7-17

యూదుల జయం 9:1-17

ఎస్తేరు చివరి విన్నపం 9:13

పూరీం పండుగ 9:18-32

మొర్‌దెకయి గొప్పతనం 10:1-3

No comments:

Post a Comment