రచయిత, వ్రాసిన కాలం:
యూదుల సాంప్రదాయం ప్రకారం సమూయేలు ఈ పుస్తకాన్ని వ్రాశాడు, అయితే అలా అనడానికి సాక్ష్యాధారాలు లేవు. అలాగే ఏ కాలంలో దీనిని వ్రాయడం జరిగిందో కూడా ఖచ్చితంగా చెప్పలేము.
ముఖ్యాంశాలు:
ఒక ముఖ్యాంశం వ్యక్తులమధ్య ఉన్న దయ, ప్రేమ, వాటి ఫలితాలు. మరో ముఖ్యాంశం – ఇతర ప్రజలలో ఒకరైన రూతు యెహోవాను విశ్వసించి దేవుని ప్రజలలో ఒకరు కావడం. రూతు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా, దావీదుకు ప్రభువైన యేసుకు పూర్వ జనని అయింది. మరో ముఖ్యాంశం – విడిపించగల బాధ్యతగల సమీప బంధువు. ‘విడిపించగల బంధువు’ క్రీస్తును పోలిన నమూనాలో ఉన్నాడు. 2:20 దగ్గర ఉన్న నోట్‌ను చూడండి. విడిపించేవాడు తప్పక సమీప బంధువు అయి ఉండాలనే నియమముంది. క్రీస్తు మానవుడయ్యాడు (హీబ్రూ 2:9-18). కోల్పోయిన సొత్తును తిరిగి సంపాదించుకోవడానికి తగిన సామర్థ్యం, అనుకూలత ఆ బంధువుకు ఉండాలి (రూతు 4:2-10). క్రీస్తుకు మాత్రమే విమోచన క్రయధనాన్ని చెల్లించగల సామర్థ్యం ఉంది (కీర్తన 49:7-9; 1 పేతురు 1:18-19). ‘విడిపించగల బంధువుడు’ విడిపించడంలో వెల చెల్లించడానికి ఇష్టపడాలి (4:4, 6, 9). మన విమోచనార్థం క్రీస్తు వెల చెల్లించడానికి ఇష్టపడ్డాడు (మత్తయి 20:28; యోహాను 10:11, 17, 18). ‘విడిపించగల బంధువు’ చనిపోయిన బంధువుని భార్యను పెళ్ళిచేసుకోడానికి ఇష్టపడాలి. ఆత్మ సంబంధమైన భావంలో దీనిని కూడా క్రీస్తు నెరవేరుస్తున్నాడు. చూడండి రోమ్ 7:1-4.
విషయసూచిక
ఒక యూదా కుటుంబానికి కలిగిన విపత్తు 1:1-5
రూతు నయోమిని, నయోమి దేవుణ్ణి అనుసరించడానికి నిర్ణయం 1:6-18
వారు బేత్లెహేము రావడం 1:19-22
బోయజు పొలాలలో రూతు 2:1-23
రూతు కోసం నయోమి తగిన ఏర్పాటు చేయడం 3:1-6
విడిపించగల బంధువు అయిన బోయజు 3:7-18
కోల్పోయిన సొత్తును తిరిగి కొని రూతును బోయజు పెండ్లాడాడు 4:1-13
రూతు రాజైన దావీదుకు పూర్వజనని అయింది 4:13-21
No comments:
Post a Comment