Breaking

Saturday, 20 November 2021

2 సమూయేలు (పరిచయం)



రచయిత, వ్రాసిన కాలం:

1 సమూయేలు పరిచయం చూడండి.

ముఖ్యాంశాలు:

యూదా ఇస్రాయేల్‌ల పై దావీదు ఏలుబడి. దాని విజయం, పేరుప్రఖ్యాతులు, దావీదుతో దేవుని ఒడంబడిక, దావీదు చేసిన పాపం, అతనికి వచ్చిన శిక్ష.



విషయసూచిక

సౌలు, యోనాతానుల మరణం గురించి దావీదు వినడం 1:1-16

దావీదు విలాపం 1:17-27

దావీదు యూదాలో తన పరిపాలనను ఆరంభించడం 2:1-7

అబ్నేరుతో యుద్ధం 2:8-32

హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు 3:2-5

అబ్నేరు దావీదు పక్షంలో చేరడం 3:6-21

యోవాబు అబ్నేరును చంపడం 3:21-39

సౌలు కుమారుడైన ఇష్బోషెతు హత్య 4:1-12

దావీదు ఇస్రాయేల్‌మీద రాజు కావడం 5:1-5

దావీదు జెరుసలం వశపరచుకొని దానిని తన స్వంత పట్టణం చేసుకోవడం 5:1-16

దావీదు ఫిలిష్తీయవారిని ఓడించడం 5:17-25

దావీదు మందసాన్ని జెరుసలంకు తీసుకురావడం 6:1-23

దేవాలయం కట్టాలని దావీదు కోరిక 7:1-7

దావీదుతో దేవుని ఒడంబడిక 7:8-16

దావీదు ప్రార్థన 7:17-29

దావీదు చేసిన యుద్ధాలు, అతని అధికారాలు 8:1-18

యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పట్ల దావీదు చూపించిన దయ 9:1-13

దావీదు అమ్మోన్‌వారిని సిరియవారిని ఓడించడం 10:1-19

బత్‌షెబతో దావీదు చేసిన పాపం 11:2—12:24

పాపం. 11:2-5

ఊరియా చావుకు దావీదు ఏర్పాట్లు 11:6-24

దావీదు బత్‌షెబను పెండ్లాడడం 11:24-27

నాతాను దావీదును మందలించి, శిక్షను గురించి ప్రకటించడం 12:1-14

దావీదు తన పాపాన్ని ఒప్పుకోవడం 12:13

శిక్ష ఆరంభం 12:15-23

సొలొమోను పుట్టుక 12:24-25

దావీదు కుటుంబ సమస్యలు, అతని శిక్ష కొనసాగడం 13:1—18:33

అమ్నోను తామారును చెరపడం 13:1-22

అబ్‌షాలోం అమ్నోనును చంపి పారిపోవడం 13:23-39

అబ్‌షాలోం తిరిగి రావడం 14:1-33

దావీదుమీద అబ్‌షాలోం పన్నాగం 15:1-12

దావీదు పారిపోవడం 15:13-37

సీబా కథ 16:1-4

షిమీ దావీదును శపించడం 16:5-13

హూషయి, అహీతోపెలు అనే ఇద్దరు సలహాదారులు 16:15—17:14

అబ్‌షాలోం ఎత్తుగడలను గురించి యాజులు

దావీదుకు కబురు పంపడం 17:15-22

అహీతోపెలు ఆత్మహత్య 17:23

అబ్‌షాలోం మరణము 18:1-17

అబ్‌షాలోం గురించి దావీదు దుఃఖించాడు 18:19-33

యోవాబు సలహా 19:1-8

దావీదు జెరుసలంకు తిరిగి రావడం 19:9-43

షెబ తిరుగుబాటు 20:1-26

కరవు, గిబియోన్‌వారు, సౌలు 21:1-14

ఫిలిష్తీయవారితో యుద్ధాలు 21:15-22

దావీదు స్తుతిగీతం 22:1-51

దావీదు చివరి మాటలు 23:1-7

దావీదు శూరులు 23:8-39

ప్రజలను లెక్కించడంలో దావీదు పాపం 24:1-10

దావీదు పాపానికి శిక్ష 24:11-17

దావీదు బలిపీఠాన్ని కట్టి బలిని అర్పించాడు 24:18-25

No comments:

Post a Comment