Breaking

Tuesday, 26 October 2021

సమాధానం కావాలా? ( అయితే ఈ వాక్యాలు వినండి )





John(యోహాను సువార్త) 14:27


27.శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.




1 Peter(మొదటి పేతురు) 3:10,11


10.జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. 

11.అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను



1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 5:15


15.ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి



Romans(రోమీయులకు) 12:17,18


17.కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి. 

18.శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. 




Matthew(మత్తయి సువార్త) 11:28,29,30


28.ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 

29.నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 

30.ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.




John(యోహాను సువార్త) 16:33


33.నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.



James(యాకోబు) 3:18


18.నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.




Isaiah(యెషయా గ్రంథము) 54:10


10.పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 




Psalms(కీర్తనల గ్రంథము) 34:14


14.కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.





Philippians(ఫిలిప్పీయులకు) 4:6,7


6.దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 

7.అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. 











No comments:

Post a Comment