Breaking

Monday, 20 September 2021

Bible Quiz On Esther

 



ఎస్తేరు గ్రంధములో మొత్తం అధ్యాయాలు ఎన్ని? 

10

11

12

13




హిందూదేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరువది యేడు సంస్థానములను ఎవరు ఏలెను?  

నెబుకద్నెజరు 

బెల్షస్సరు 

దర్యావేషు 

అహష్వేరోషు



రాజైన అహష్వేరోషు ఏ కోటలో నుండి రాజ్యపరిపాలన చేయుచుండెను 

ఉత్తరపు కోటలో నుండి

దక్షిణపు కోటలో నుండి

పశ్చిమపు కోటలో నుండి

షూషను కోటలో నుండి





అహష్వేరోషు​ తన యేలుబడి యందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును ---- చేయించెను? 

సన్మానం 

అభిషేకం

విందు

ఆయుధములు 

 




అహష్వేరోషు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను ఎన్ని దినములు కనుపరచెను? 

నూట ఎనుబది దినములు

నూట ఎనుబది రెండు దినములు

నూట ఎనుబది మూడు దినములు

నూట ఎనుబది నాలుగు దినములు



రాజు కోటలోని తోట ఆవరణములో ఎన్ని దినములు విందు చేయించెను? 

ఐదు దినములు

ఆరు దినములు

ఏడు దినములు 

పది దినములు 



రాణియైన వష్తి రాజైన అహష్వేరోషు కోటలో ఎవరికి విందు చేయించెను?

పిల్లలకు 

వృద్ధులకు 

స్త్రీలకు

నపుంసకులకు



రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజు ఎవరికి ఆజ్ఞాపించెను? 

స్త్రీలకు 

సైనికులకు

ప్రాధానులకు

నపుంసకులకు



రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల --------?  

భయపడెను 

దిగులుపడెను 

కలవరపడెను 

కోపగించెను



నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము రాణి చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని రాజు ఎవరినడిగెను? 

కాలజ్ఞానులను

నపుంసకులను 

ప్రాధానులను 

అధికారులను 









రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను అని అన్నది ఎవరు? 

అద్మాతా

మెరెను 

మర్సెనా 

మెమూకాను



మెమూకాను రాజుతో - రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్దనుండి యొక ----- పుట్టవలెననెను? 

మాట 

ఆజ్ఞ

ఆలోచన 

అధికారం 


మెమూకాను రాజుతో - వష్తికంటె యోగ్యురాలిని తాము ------ గా  చేయవలెననెను? 

రాణినిగా

సేవకురాలిగా 

సాక్షిగా 

పరిచారకురాలిగా 





రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘనురాలు గాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను ---- చేయుదురని చెప్పెను? 

ఎదురించుదురని 

సన్మానించుదురని

క్షమించుదురని 

ప్రేమించుదురని 



మెమూకాను ​చెప్పిన ఈ సంగతి రాజునకును అధిపతులకును -------- గా ఉండెను? 

అనుకూలముగా

ప్రతికూలముగా 

వ్యతిరేకముగా 

హేయముగా 



ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన ----- ననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు రాజు ఆజ్ఞ ఇచ్చెను? 

మనసు ననుసరించి

స్వభాష ననుసరించి

నడుకననుసరించి 

బాధ్యతననుసరించి 



రాజు ఈ ఆజ్ఞ ఇచ్చి తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన ----- పంపించెను? 

సమాచారం

తాకీదులు

సాక్షములు 

వివరణలు 

 

రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమెచేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని ------? 

మరచిపోయెను 

మార్చివేసెను

తలంచెను

కొట్టివేసెను 

 


అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,అని రాజుతో అన్నది ఎవరు? 

యౌవనులగు రాజు సైనికులు 

యౌవనులగు రాణి సేవకులు 

యౌవనులగు రాజు పరిచారకులు

యౌవనులగు రాణి పరిచారకులు



కన్యకలలో రాజు దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా ------- అగును అనెను? 

భార్య అగుననెను 

రాణి అగుననెను

సేవకురాలు అగుననెను

అధికారి అగుననెను

















మొర్దెకై తండ్రి పేరు ఏమిటీ 

కీషు

షిమీ

హేగే

యాయీరు




మొర్దెకై ఏ వంశస్థుడు? 

రూబేను 

షిమ్యోను 

లేవి 

యాయీరు




రాజైన నెబు కద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొని పోయినప్పుడు  మొర్దెకై యెకోన్యాతో కూడ ------  నుండి చెరపట్టబడినవారిలో ఒకడు? 

యెరూషలేము నుండి

బబులోను నుండి

షోమ్రోను నుండి

మోయాబు నుండి 





మొర్దెకై పినతండ్రి కుమార్తె పేరు ఏమిటీ?  

ఎస్తేరు

రూతు 

నయోమి 

ఓర్పా 




 


ఎస్తేరు తలితండ్రులు లేనిదై యుండగా మొర్దెకై ఆమెను ----- ?

పెంచుకొనెను

విడిచిపెట్టెను 

పట్టించుకొనెను 







ఎస్తేరు అందమైన రూపమును సుందరమైన ------ గలదై యుండెను? 

చేతులు గలదై

చెవులు గలదై

కండ్లు గలదై

ముఖము గలదై


ఎస్తేరు తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన ----- గా స్వీకరించెను? 

సహోదరిగా 

కుమార్తెగా

భార్యగా

స్నేహితురాలిగా  




కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి ----- వశమునకు అప్పగింపబడిరి? 


యాయీరు వశమునకు

హేగే వశమునకు

షిమీ వశమునకు

రాజు వశమునకు




ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు ----- వశమునకు అప్పగింపబడెను? 

హేగే వశమునకు

యాయీరు వశమునకు

షిమీ వశమునకు

రాజు వశమునకు



ఎస్తేరు అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన ------ పొందెను? 

లాభము 

నష్టము 

దయ

సహాయము 











హేగే ఎస్తేరును అంతఃపురములో  ----- స్థలమందుంచెను? 

అతి శ్రేష్ఠమైన స్థలమందు

అతి ముఖ్యమైన స్థలమందు

అతి హీనమైన స్థలమందు

అతి దిగువ స్థలమందు



నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించింది ఎవరు? 

హేగే 

రాజు 

మొర్దెకై

యాయీరు 




ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై ప్రతిదినము మొర్దెకై ఎక్కడ తిరుగులాడుచుండెను? 

అంతఃపురము యొక్క స్తంభముల ఎదుట

అంతఃపురము యొక్క గోడల ఎదుట

అంతఃపురము యొక్క గుమ్మముల ఎదుట

అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట 



​మొర్దెకై పిన తండ్రి పేరు ఏమిటీ? 

షిమీ 

హేగే 

యాయీరు

అబీహాయిలు




రాజుయొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఏమియు ఎస్తేరు కోరలేదు ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు ----- పుట్టెను? 

దయ

పగ  

అసహ్యం

అసూయ



 రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను ----- నెలలో ఎస్తేరు రాజ నగరులోనున్న  రాజు నొద్దకు పోయెను? 

ఐదవ నెలలో

ఆరవ నెలలో

ఏడవ నెలలో

పదియవ నెలలో



​స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన ----- పొందెను? 

సిరి సంపదలు 

పగ ప్రతీకారములు 

దయాదాక్షిణ్యములు

దీవెన ఆశీర్వాదములు 



రాజు రాజ్యకిరీటమును ఎస్తేరు తలమీద ఉంచి ఆమెను ------ కి  బదులుగా రాణిగా నియమించెను? 


హేగెకి బదులుగా

షిమీకి బదులుగా 

వష్తికి బదులుగా

కీషుకి బదులుగా



రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై యొక గొప్ప ------- చేయించెను? 

ఉత్సవము 

విందు

విగ్రహము 

ప్రకటన 




రాజు సంస్థానములలో సెలవుదినము ప్రకటించి తన  స్థితికి తగినట్టుగా ------ ఇప్పించెను? 

బంగారము

బహుమతులు

ఆహారము 

వస్త్రములు 















రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై ఎక్కడ కూర్చుని యుండెను? 

రాజు గుమ్మములో

రాజు భవనములో 

రాజు ఆలయములో 

రాజు అంతఃపురములో 




ఎస్తేరు మొర్దెకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె -----?  

తిరుగబడుచుండెను

బయపడుచుండెను 

లోబడుచుండెను

విసుగుపడుచుండెను





మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన -------- ను తెలియజేయక యుండెను? 

ఎత్తును బరువును 

ఆలోచనలను అలవాట్లను 

జాతిని వంశము 

ఆనందమును ఆరోగ్యమును 




బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై ఎవరిని చంపుటకు ఆలోచించుకొని యుండిరి? 

రాజైన అహష్వేరోషును

రాణియైన ఎస్తేరును 

యాయీరు వంశస్థుడైన మొర్దెకైని 

అగాగీయుడగు హామానును



ఈ సంగతి మొర్దెకైకి తెలియబడి నందున అతడు దానిని ఎవరితో చెప్పెను? 

జనులతో 

సైనికులతో 

ఎస్తేరుతో 

అహష్వేరోషుతో 





ఎస్తేరు ఎవరి పేరట రాజునకు దాని తెలియజేసెను? 

మొర్దెకైపేరట

జనుల పేరట 

తన పేరట 

హామాను పేరట 



ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది ------? 

నిజమాయెను

అబద్ధమాయెను 

వెల్లడియాయెను 

నిష్ఫలమాయెను




బిగ్తాను తెరెషు అను వీరిద్దరును ఒక చెట్టుకు -------? 

కట్టి వేయబడిరి 

కొట్టి వేయబడిరి 

వ్రేలాడ వేయబడిరి

ఉరి తీయింపబడిరి




ఇది రాజు ఎదుటనే ------- గ్రంథమందు వ్రాయబడెను? 

జీవ గ్రంథమందు

పరిశుద్ధ గ్రంథమందు

రాజుల వృత్తాంతముల గ్రంథమందు

రాజ్యసమాచార గ్రంథమందు



హామాను తండ్రి పేరు ఏమిటీ? 

అగాగీ

హమ్మెదాతా

అహష్వేరోషును

యాయీరు











రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని ఎవరికి  నమస్కరించిరి? 

ఎస్తేరునకు 

హామానునకు

మొర్దెకైనకు 

యూదులకు 


వీరిలో హామానుకు నమస్కారము చేయనిది ఎవరు? 

మొర్దెకై

ఎస్తేరు 

యాయీరు 

యూదులు 



నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగింది ఎవరు? 

ఎస్తేరు

యూదులు 

రాజసేవకులు

హామాను 


రాజసేవకులు ప్రతిదినము మొర్దెకైతో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారుమొర్దెకైయొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని ఎవరికి తెలిపిరి?

రాజునకు 

ఎస్తేరునకు 

హామానునకు

యూదులకు 

 



​మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా ------? 

భయపడెను 

దిగులుపడెను 

కలతపడెను 

కోపగించెను


అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలోచించింది ఎవరు? 

హామాను 

ఎస్తేరు 

మొర్దెకై

యాయీరు 



ఈ హామాను ఎవరికి శత్రువు? 

యూదులకు

జనులకు 

ఎస్తేరుకు 

రాజుకు 



యూదుల నందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారిచేత ఎక్కడికి పంపబడెను? 

రాజ్య భవనములన్నింటికి

రాజ్య సంస్థానములన్నిటికి

రాజ్య పొలిమేరలన్నింటికీ 

రాజ్య వీధులన్నింటికీ 





అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి ఆ యాజ్ఞ ---- కోటలో ఇయ్యబడెను? 

మహా కోటలో

షూషను కోటలో

రాణి కోటలో

జనుల కోటలో



అంతట రాజును హామానును ---- నకు కూర్చుండిరి? 

విందుకు

విచారణకు 

విగ్రహరాధనకు 

వినోదమునకు 














మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని ------ మధ్యకు బయలువెళ్లెను? 

జనుల మధ్యకు

అధికారుల మధ్యకు 

పట్టణము మధ్యకు

సైనికుల మధ్యకు 



మొర్దెకై మహా శోకముతో ------ చేసెను? 

రోదనము

నాట్యము 

విజ్ఞాపన 

విన్నపము 




మొర్దెకై మహా శోకముతో రోదనము చేసి ఎక్కడికి వచ్చెను? 

రాజు గుమ్మము ఎదుటికి

రాజు సింహాసనము ఎదుటికి 

రాజు భవనము ఎదుటికి 

రాజు సైన్యము ఎదుటికి 



గోనె కట్టు కొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ----- కలదు? 

అభిప్రాయం కలదు

ఆలోచన కలదు

ఆజ్ఞ కలదు

మాట కలదు






​రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థాన మునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ----- ఉండి  మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి? 

ఆలయములో ఉండి  

నిశ్శబ్దముగా ఉండి 

ఉపవాసముండి

బాధలో ఉండి 




ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఎవరికి తెలియజేసిరి? 

రాజునకు 

ఎస్తేరునకు

మొర్దెకైనకు 

హామానునకు 




రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, అతనియొద్దకు ------- పంపెను? 

తాఖీదులు 

వస్త్రములు

ఆహారము 

ద్రాక్ష గెలలు 




ఎస్తేరు పంపిన వస్త్రములను మొర్దెకై ------? 

తీసికొనెను 

తీసికొనలేదు

పారవేసెను 

కాల్చివేసెను 




ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు అతని ------ యొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను? 

మొర్దెకైయొద్దకు

రాజు యొద్దకు 

హామాను యొద్దకు 

జనుల యొద్దకు 




మొర్దెకై తనకు సంభవించిన దంతయు, యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారినిబట్టి రాజు ఖజానాకు తూచి యిచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత యనియును ఎవరికి తెలిపెను? 

హతాకునకు 

ఎస్తేరుకు 

రాజుకు 

జనులకు 











హతాకు వచ్చి మొర్దెకైయొక్క మాటలను ఎవరితో  చెప్పెను? 

రాజుతో 

ఎస్తేరుతో

హామానుతో 

జనులతో 




నేటికి ముప్పది దినములనుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమని ఎవరు ఎవరితో అనెను? 

ఎస్తేరు హతాకుతో 

ఎస్తేరు హామానుతో 

ఎస్తేరు జనులతో 

ఎస్తేరు తన పని కత్తెలతో 




ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపింది ఎవరు? 

హామాను 

హతాకు

జనులు 

యాయీరు 




మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ ----- లో తలంచుకొనవద్దు అనెను? 

మనస్సులో 

గృహములో 

నగరులో 

ఆవరణములో 



మొర్దెకై ఎస్తేరుతో  నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు ----- దిక్కునుండి వచ్చుననెను? 

తూర్పు దిక్కునుండి

ఉత్తర దిక్కునుండి

దక్షిణ దిక్కునుండి

మరియొక దిక్కునుండి





నీవు ఈ సమయమును బట్టియే ------ నకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పెను? 

లోకమునకు 

పట్టణమునకు 

గ్రామమునకు 

రాజ్యమునకు



ఎస్తేరు మొర్దెకైతో నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని ----- నకు సమకూర్చమని చెప్పెను ? 

యుద్ధమునకు

సమాజమందిరమునకు

ఆవరణమునకు 

గృహమునకు




నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; అని అన్నది ఎవరు? 

ఎస్తేరు

మొర్దెకై

హతాకు

హామాను 



ఈ సమయమందు రాజునొద్దకు ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను అని అన్నది ఎవరు?

మొర్దెకై

ఎస్తేరు

హతాకు

హామాను 



మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా -------? 

నడిపించెను 

జరిగించెను

వినిపించెను 

చూపించెను 



















మూడవ దినమందు ఎస్తేరు ----- ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను? 

గోనెపట్ట

వెలగల వస్త్రములు 

బంగారు కిరీటము 

రాజభూషణములు


రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు ------?  కూర్చుని యుండెను

నిలుచుని ఉండెను 

అనుకుని ఉండెను 

పడుకొని ఉండెను 






​రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి ---- పుట్టెను? 

ఇష్టము

ప్రేమ 

దయ

కోపము 




రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి  --- ముట్టెను? 

రాజు యొక్క చేతిని 

రాజు యొక్క సింహాసనమును 

దండము యొక్క కొనను 

రాజు యొక్క పాదములను 




రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో ----  మట్టుకు నీకను గ్రహించెదనని రాజు ఆమెతో చెప్పెను? 

కొంత మట్టుకు 

సగము మట్టుకు

చాలా మట్టుకు 

అదిక మట్టుకు 



ఎస్తేరు తాను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు ఎవరు రావలెనని కోరెను? 

రాజును హామానును 

రాజును మొర్దెకైని 

రాజును హాతాకును 

రాజును జనులును 




రాజును హామానును ఎస్తేరు చేయించిన ----- నకు  వచ్చిరి? 

ఉత్సవమునకు 

విందునకు

గుడారమునకు

ఆలయమునకు 




రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ ----- యేమిటి? అని అడిగెను? 

కోరిక యేమిటి అని

బలము యేమిటి అని

బాధ యేమిటి అని

భయము యేమిటి అని





ఎస్తేరు రాజుతో రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు ----- నకు రావలెణనెను? 

పండుగకు

ప్రతిష్టకు 

విందునకు

ఉత్సవమునకు




ఎస్తేరు రాజుతో  రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా ------ యు ననెను? 

ఆశయు అనెను

బలముయు అనెను

కోరికయు అనెను 

బాధయు అనెను













హామాను సంతోషించి ------ గలవాడై బయలువెళ్లెను? 

ఉత్సాహము గలవాడై

మనోల్లాసముగలవాడై

అత్యుత్సాహాము గలవాడై

ఆనందోత్సహాము  గలవాడై




వీరిలో మొర్దెకైమీద బహుగా కోపగించింది ఎవరు? 

ఎస్తేరు 

జెరెషు

హామాను

హతాకు 




హామాను భార్య పేరు ఏమిటీ? 

జెరెషు

మహేతబేలు

యాయేలు 

మయకా 




రాజు క్రిందనుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చి హామాను ఎవరితో చెప్పెను? 

తన భార్యయైన జెరెషుతో 

తన  స్నేహితులందరితో

తన శత్రువులందరితో 

తన భార్యయైన జెరెషుతో తన  స్నేహితులందరితో 




రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని హామాను ఎవరికి తెలియజేసెను? 

తన భార్యయైన జెరెషుతో 

తన  స్నేహితులందరితో 

తన శత్రువులైన యూదులతో 

తన భార్యయైన జెరెషుతో తన  స్నేహితులందరితో 




యూదుడైన మొర్దెకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ------- లేదని హామాను చెప్పెను? 

ప్రయోజనము

ఆనందము 

లాభము 

నష్టము 



మొర్దెకై ఉరితీయింపబడునట్లు ఏబది మూరల ఎత్తుగల ఉరికొయ్య ఒకటి చేయించుము; అని హామానుతో అన్నది ఎవరు? 

అతని భార్యయైన జెరెషు

అతని స్నేహితులందరు

తన భార్యయైన జెరెషు

తన  స్నేహితులందరు

తన జనులందరు 




రాత్రి నిద్రపట్టక పోయినందున రాజు ----- గ్రంథము తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను? 

పరిశుద్ద గ్రంధము 

జీవ గ్రంధము

రాజ్య సమాచార గ్రంధము 

రాజుల వృత్తాంతముల గ్రంధము 



బిగ్తాను తెరెషు అను వారు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి ఎవరు తెలిపినట్టు రాజ్యపు సమాచార గ్రంథములో వ్రాయబడి యుండెను? 

ఎస్తేరు

మొర్దెకై 

జనులు 

హామాను 




మొర్దెకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని రాజు ఎవరినడిగెను? 

తన సేవకులను 

తన సైనికులను 

తన మంత్రులను 

తన అధికారులను 



మొర్దెకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని రాజు తన సేవకులను అడుగుగా  వారు ఏమని ప్రత్యుత్తర మిచ్చిరి? 

అతనికేమియు చేయబడలేదని 

అతనికన్నియు  చేయబడెనని

అతనికవన్నియు అవసరము లేదని 

అతనికవన్నియు అవసరమేనని 


















మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై హామాను ఎక్కడికి వచ్చియుండెను? 

రాజనగరుయొక్క గుమ్మములోనికి 

రాజనగరుయొక్క ఆవరణము లోనికి

రాజనగరుయొక్క అంతస్థు లోనికి 

రాజనగరుయొక్క ఆలయములోనికి 



ఏలినవాడా చిత్త గించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పింది ఎవరు? 

ఎస్తేరు

రాజ సేవకులు

మొర్దెకై 

నపుంసకులు 



రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని రాజు ఎవరినడిగెను? 

హామానును 

మొర్దెకైని 

ఎస్తేరును 

తన సేవకులను 



నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపే క్షించునని తనలో తాను అనుకొన్నది ఎవరు? 

ఎస్తేరు

మొర్దెకై 

హామాను

హతాకు 


రాజు ఘనపరచ నపేక్షించింది ఎవరిని? 

ఎస్తేరును 

మొర్దెకైని

హామానును 

హతాకును 


హామాను తల కప్పుకొని దుఃఖించుచు ఎక్కడికి వెళ్లి పోయెను? 

తన యింటికి

రాజ నగరుకు 

ఆవరణమునకు 

పట్టణమునకు 



హామాను తనకు సంభవించినదంతయు ఎవరికి తెలిపెను? 

తన భార్యయైన జెరెషుకు

తన స్నేహితులకు 

రాణియైన ఎస్తేరుకు 

తన భార్యయైన జెరెషుకును 

తన స్నేహితులకును 



మొర్దెకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడి పోదువని హామానుతో అన్నది ఎవరు? 

అతనియొద్దనున్న జ్ఞానులు

అతని భార్యయైన జెరెషు

రాణియైన ఎస్తేరు

అతనియొద్దనున్న జ్ఞానులును 

అతని భార్యయైన జెరెషును 


రాజుయొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని ఎవరిని త్వరపెట్టిరి? 

హామానును

మొర్దెకైని 

హతాకును 

జనులను 



రాజును హామానును రాణియైన ఎస్తేరు నొద్దకు విందు నకు రాగా రాజు - ఎస్తేరు రాణీ, నీ ------ మేమిటి? అని అడిగెను? 

విజ్ఞాపన మేమిటి? అని

బాధ మేమిటి? అని

ఆలోచన మేమిటి? అని

అభిప్రాయం మేమిటి? అని













సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము.అని రాజుతో అన్నది ఎవరు? 

ఎస్తేరు 

మొర్దెకై 

హామాను 

హతాకు 



మా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అని ఎస్తేరు ఎవరితో అనెను? 

రాజుతో 

మొర్దెకైతో 

హతాకుతో 

జనులతో 




హామాను రాజు ఎదుటను రాణి యెదుటను ---- ఆయెను? 

గొప్పవాడాయెను 

అల్పుడాయెను 

భయాక్రాంతుడాయెను

మరణమాయెను 




రాజు ఆగ్రహమొంది ద్రాక్షా రసపు విందును విడిచి ఎక్కడికి పోయెను? 

రాజ నగరుకు 

నగరు వనమునకు

నగరు ఆవరణమునకు 

రాజ భవనమునకు 





రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు ---- చేయుటకై నిలిచెను? 

విచారణ 

విన్నపము

విలాపము 

విమోచన 



నగరువనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద ఎవరు బడియుండెను? 

హతాకు 

మొర్దెకై 

జేరేషు 

హామాను




వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ------ వేసిరి? 

ముద్ర

ముసుకు

సంకెళ్లు 

వస్త్రము 

 




ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్నదని రాజుతో అన్నది ఎవరు ? 

హతాకు 

హర్బోనా

మర్సెనా 

మెమూకాను


మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన  ఉరికొయ్య ఎంత ఎత్తు గలది? 

ఇరువది మూరల యెత్తుగలది 

ముప్పది మూరల యెత్తుగలది 

యేబది మూరల యెత్తుగలది 

అరువది మూరల యెత్తుగలది 


హామాను చేయించిన ఉరికొయ్య మీద ఎవరిని ఉరితీయుడని రాజు ఆజ్ఞ ఇచ్చెను? 

మొర్దెకైని 

హామానును

జేరెషును

హతాకును 

 







రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని ఎవరికిచ్చెను? 

ఎస్తేరుకు 

మొర్దెకైకి

జేరేషుకు 

హతాకుకు 



రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును ఎవరికిచ్చెను?

ఎస్తేరుకు 

మొర్దెకైకి

హతాకుకు 

జేరేషుకు 


హామాను యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో రాజును  వేడుకొన్నది ఎవరు? 

ఎస్తేరు

మొర్దెకై 

హతాకుకు 

జేరేషుకు 



​రాజు బంగారు దండమును ఎవరితట్టు చాపెను? 

ఎస్తేరు తట్టు

మొర్దెకై తట్టు

జేరేషు తట్టు

జనుల తట్టు 



ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ----- ఇయ్యుడనెను?. 

సలహా  

అధికారం

అవకాశం 

ఆజ్ఞ


నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింప గలనని రాజుతో మనవి చేసింది ఎవరు? 

ఎస్తేరు 

మొర్దెకై 

జేరేషు

హతాకు 




రాజు ఎస్తేరుతో మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి ----- తో  దాని ముద్రించుడనెను? 

రాజు మాటతో 

రాజు సేవకులతో 

రాజు సైనికులతో 

రాజు ఉంగరముతో



సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దిన మందు రాజుయొక్క ------ పిలువబడిరి? 

అధిపతులు 

సేవకులు 

వ్రాతగాండ్రు

సంరక్షకులు 



మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారము ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషను బట్టియు ------ వ్రాయబడెను? 

పుస్తకములు 

పద్యములు 

తాకీదులు

ప్రమాణములు 



​రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి ----- మీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను? 

గుఱ్ఱములమీద

గాడిదల మీద 

ఒంటెల మీద 

రథముల మీద 











No comments:

Post a Comment