upavasa prarthana lo song lyrics :
నాఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నా పాప క్రియలన్నియూ నే విడిచి పెట్టెదనయ్యా
నా దోషమును మన్నించీ నన్ను పరిశుద్ధునిగ మార్చయ్యా
నా అహము పోవాలయ్యా నాకు దీనత్వము ఇవ్వేయేసయ్యా!
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా
1.మోషే ఉపవాసముండి ప్రార్ధించినపుడు
నీ ధర్మశాస్త్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
నా యెడల నీచిత్తమూ..(తెలియజేయుమూ)(2)
2.దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
రాబోయే సంగతులు చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2)
నూతన దర్శనమూ..(నాకుదయచేయమూ)..(2)
3.నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినపుడు
పడిన ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
పాడైన నా బ్రతుకునూ.. "బాగుచేయమూ.. (2)
4.నీవు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
అపవాదినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
శోధనపై జయమొందే.. "కృపను నా కియ్యుమూ.. (2)
5.ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
నా దేశప్రజలనూ.. "నీవు రక్షించుమూ.. (2)
6.పౌలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2)
నీ సంఘస్థాపనకూ... "నన్ను వాడుమూ.." (2)
7.యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
మేము ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
కడవరి ఉజ్జీవమూ.. "మాపై కుమ్మరించుమూ"..(3)
No comments:
Post a Comment