Breaking

Thursday, 1 July 2021

Motivational words #1 ధైర్యము తెచ్చుకో





భయం మిమ్మల్ని ఏలుతుందా 
మీరు చేయవల్సిన పని చేయకుండా భయం మిమ్మల్ని ఆపుతుందా 
లేదా మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారా 
అవును అనేది మీ సమాధానమైతే ఈ వీడియో మీ కోసమే skip చేయకుండా పూర్తిగా వినండి 

భయాన్ని ఎదుర్కొని దాన్ని జయించి తమ జీవితంలో  విజయాన్ని సాధించిన నలుగురు వ్యక్తుల గురించి 
ఈ వీడియోలో చెప్పబోతున్నాను 
వాళ్ళు ఏలాంటి భయాల గుండా వెళ్లారో ఆ భయాన్ని ఎలా అధిగమించారో వారి జీవితాలు ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం 

అందులో మొదటి వ్యక్తి మోషే 
మోషే రాజు తనను చంపేస్తాడేమో నని బయపడి 
ఐగుప్తు దేశాన్ని విడిచి మోయాబు అనే దేశానికి 
పారిపోయాడు ఐగుప్తు సకల విద్యలభ్యసించిన వాడు మోయాబు దేశములో గొర్రెలు మేపుతూ బ్రతుకుతున్నాడు 
భయం ఒక వ్యక్తిని ఎంత దిగువ స్థాయికైన తీసుకువెళ్తుంది భయంతో బ్రతికే వాడు ఎప్పటికి విజయాన్ని సాధించలేడు మోషే భయపడ్డాడు కానీ ఆ భయంలోనే కొనసాగలేదు దేవుని మాటను విశ్వసించి 
ఐగుప్తు రాజును ధైర్యముగా ఎదుర్కొన్నాడు 
తన ప్రజల బానిసత్వపు సంకెళ్లను తెంచగలిగాడు 
మనము కూడా మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి భయానికి లోనవ్వచ్చు కానీ ఆ భయంలోనే కొనసాగడానికి వీలులేదు 
దేవుని మాటలను విశ్వసించి మన పరిస్థితులను ధైర్యముగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి 
అప్పుడే మన పరిస్థితులను అధిగమించి మన జీవితంలో విజయాన్ని సాధించగలం 

నా సమస్యలు చాలా పెద్దవి నా పరిస్థితులు చాలా క్లిష్టమైనవి వీటి నుండి ఎలా బయట పడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని మీరంటున్నట్లైతే ఒక్కసారి దావీదు జీవితాన్ని చూడండి 
దావీదు ఎదుర్కొన్న సమస్యలు దావీదు కొచ్చిన సవాల్లు చాలా పెద్దవే చాలా క్లిష్టమైనవే 
దావీదు తనకు తానుగా ఆ సమస్యల్ని జయించలేడు 
తనకు తానుగా విజయాన్ని సాధించలేడు
అందుకే దావీదు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు 
దేవుని కృపనాశ్రయించాడు 
గొల్యాతును చూసి సైన్యమంతా బయపడి పోయారు 
యుద్ధ విద్యలు నేర్చుకున్నవారు సైతం గొల్యాతును చూసి వెనుకంజ వేశారు 
కానీ దావీదు గొల్యాతును ధైర్యముగా ఎదుర్కొని అతి సులువుగా అతన్ని  హతమార్చాడు 
ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే దేవుని కృపను కోరుకుంటే అతి పెద్ద సమస్యను కూడా అతి సులువుగా జయించగలుగుతాడు 
ఇందుకు దావీదు జీవితమే ఒక ఉదాహరణ 
మన సమస్యలు ఎంత పెద్దవైన
మన పరిస్థితులు ఎంత  క్లిష్టమైనవైన
మనం దేవుని మీద ఆధారపడితే 
అతి పెద్ద సమస్యలను కూడా అతి సులువుగా జయించగలుగుతాము గనుక మన పరిస్థితులను 
దేవునికప్పగించి విశ్వాసముతో అడుగులు వేద్దాం 

విశ్వాసం మనలో లేకపోతె దైర్యం మనలో ఉండదు 
దైర్యం మనలో లేకపోతే ఒక్క అడుగు కూడా మనము ముందుకు వేయలేము కొన్ని సార్లు 
మన జీవితంలో ఎదురయ్యే వాటిని బట్టి మనము రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది అలా రిస్క్ తీసుకోకపోతే మరింత రిస్క్ లో పడిపోయే అవకాశం ఉంటుంది 
ఎస్తేరు జీవితంలో ఇదే జరిగింది తన క్షేమం కోసం తన ప్రజల క్షేమం కోసం తను రాజును ఎదుర్కోవాల్సి ఉంది 
కానీ అలా ఎదుర్కోవడం తన ప్రాణానికే ప్రమాదం 
అలాంటి సమయములో ఎస్తేరు దేవున్నాశ్రయించింది 
దేవునిపై విశ్వాసముతో ధైర్యముగా రాజు దగ్గరికి వెళ్ళింది దేవుడు ఎస్తేరు యెడల రాజుకు దయపుట్టించి తన మనవి వినేలా చేసాడు 
ఈ విధంగా ఎస్తేరు తనను తన ప్రజల ప్రాణాలను కాపాడుకోగలిగింది 
భయంతో సమస్యను ఎదుర్కోకుండా ఆగిపోవడం కన్నా దేవున్నాశ్రయించి విశ్వాసముతో ధైర్యముతో 
దాన్ని ఎదుర్కోవడం మనకు ఎంతో మేలు చేస్తుంది 

జీవితంలో రాజీ పడిపోయి బ్రతకడం కన్నా విశ్వాసముతో అడుగులు ముందుకు వేసి చావడం మిన్నా 
అయినా మన విశ్వాసమెప్పటికీ మనల్ని బ్రతికిస్తుంది 

దానియేలు జీవితాన్ని మనము చూసినట్లయితే 
ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ రాజీ పడి పోయి ప్రార్ధనను మానడానికి మాత్రం అంగీకరించలేదు 
దేవునికి ప్రార్ధిస్తే సింహళ బోనులో వేస్తామనే ఆజ్ఞ జారీ అయినప్పటికీ దానియేలు యధాప్రకారం ముమ్మారు మోకరించి ప్రార్ధించడం మాత్రం ఆపలేదు 

ప్రాణాలు కాపాడుకొని ప్రార్ధించడం మానడం కన్నా 
ప్రార్ధనను కాపాడుకొని ప్రాణాలు పోగుట్టుకోవడమే 
మిన్నా అని దానియేలు ఎంచాడు 

అయినా సింహళ బోనులో నైనా తనను రక్షింపగలుగుటకు తన దేవుడు సమర్థుడనే రూఢియైన విశ్వాసం దానియేలులో బలంగా ఉంది 
అందుకే సింహాల బోనుకైనా ధైర్యముగా వెళ్ళాడు 

సింహాలు దానియేలుకు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతనంపించి సింహాల నోళ్లను మూయించాడు 

ధైర్యముతో దేవుని కొరకు మనము నిలబడితే మన పక్షాన మన కొరకు నిలబడి మనకు విజయాన్ని అనుగ్రహించుటకు మన దేవుడు చాలిన వాడు 

భయంతో ఆగిపోదామా విశ్వాసముతో దేవుని సహాయముతో అడుగులు ముందుకు వేద్దామా అనేది 
మన చేతుల్లోనే ఉంది 

దేవుని యందలి విశ్వాసమే మనకు ధైర్యము 
దేవుడే మనకు ఆధారము 
ఆయనకు మన జీవితాన్ని అప్పగించి పూర్తిగా ఆయన మీద ఆధారపడి అద్భుతాలు మన జీవితంలో చూద్దాం  





No comments:

Post a Comment