ఒక పాస్టర్ గారు ఒక గ్రామమునకు వెళ్ళి దేవుని వాక్యము బోధించగా ఆ రోజు 500 మంది ఆ వాక్యము విని మారుమనస్సు పొందెను.ఆతర్వాత రోజు కూడిక అయిన తర్వాత ఆయనే ఆ 500 మందికి బాప్తీస్మమిచ్చి అలసిపోయి తన గదికి వచ్చి ప్రార్దించి పడుకుంటే ఆయనకు కలలో ఒక బంగారపు కిరీటము కన్పించెను.ఆ కిరీటము మీద 100 డైమండ్స్ ఉన్నాయి.
ఆహా... నేను వాక్యము చెప్పినందుకు ఇది దేవుడు నాకిచ్చే బహుమానము అని అనుకొనకుండా, ఆయనకొంచెం తెలివిగా "ప్రభువా అక్కడ మారుమనస్సుపొంది బాప్తీస్మము తీసుకున్నది 500 మంది అయితే ఇక్కడేమిటి 100 మందే ఉన్నారు?మిగిలిన 400 మంది ఎక్కడయ్య*"అనగా?దేవుడన్నాడట,
"ఈ 100 మంది నీకష్టం వల్ల రక్షింపబడినారు."
ఈ ప్రాంతము రక్షింపబడాలని ఒక ముసలావిడ ఎన్నో రోజులు ఉపవాసముండి,కన్నీరు కార్చుచు,కడుపుమాడ్చుకొని ప్రార్దించినది,ఆ 400 ల ఆత్మలు ఆమెకే సొంతం అన్నాడు
ఒక వ్యక్తి రక్షింపబడాలని నీవు ప్రార్దిస్తే ఆవ్యక్తి రక్షింపబడితే ఆ ఆత్మ నీకే సొంతము.ప్రార్ధించే ప్రార్ధనకు జవాబు రాలేదని ప్రార్ధించుట మానేశావా?జవాబువచ్చే వరకు ప్రార్ధించు.ఏదో ఒకరోజు నీకోరిక నెరవేరుతుంది.
దేవుని సన్నిధిలో నీవు కార్చిన కన్నీరు, ప్రార్ధన ఊరకేపోదు.ఊరక నిలచి దేవుడుచేసే రక్షణకార్యము చూడుము.
No comments:
Post a Comment