agni mandinchu nalo agni mandinchu lyrics :
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)
1.అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)
2.అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)
3.అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)
4.ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)
No comments:
Post a Comment