Breaking

Friday, 21 May 2021

Idhigo devaa naa jivitham song lyrics | ఇదిగో దేవా నా జీవితం




ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం

శరణం - నీ చరణం, శరణం - నీ చరణం


1. పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో - నన్ను దరిచేర్చినావు

అందుకే గైకొనుమో దేవా ఈ నా శేషజీవితం


2.నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగనేర్పు

హృదయ భారంబు నొసగి - ప్రార్థించి పనిచేయ నేర్పు

ఆగిపోక సాగిపోవు - ప్రేషితునిగ పనిచేయనిమ్ము

ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము


3.విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు - కలకాలం మరి నాకు నొసగు నశియించు ఆత్మలను - నీ దరిచేర్చ కృపనిమ్మయా

క్షేమ క్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా











No comments:

Post a Comment