నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.
కీర్తనలు 119: 10
ప్రియులారా
దేవుని శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకెవారు ధన్యులు.
వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాప మును చేయరు
దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును.
నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.అని
ప్రియులారా
దావీదుకు దేవుని మార్గములో నడవడమంటే ఎంతో ఇష్టం కానీ ఆది తనంతట తానే చేయలేడని బాగా తెలుసు అందుకే దేవునికివిధంగా ప్రార్ధిస్తున్నాడు
మనము కూడ మన సొంత శక్తి చేత దేవుని మార్గములోములో నడవాలని ప్రయత్నించిన నడవలేము కాబట్టి మనము దేవుని సహాయాన్ని పొందుకొని మన పూర్ణ హృదయముతో ఆయన్ను వెదుకుతూ ఆయన మార్గములో నడవలసిన వారమై యున్నాము
ఈ వాక్యం మనము దేవుని శాసనములను గైకొనుచు మన పూర్ణహృదయముతో ఆయనను వెదకెవారమై యుండాలని తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని దేవుని సహాయాన్ని పొందుకొని ఆయన మార్గములో నడిచే వారమై యుందాం
అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక
No comments:
Post a Comment