దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును
మత్తయి 6: 22
సహోదరి సహోదరులారా
లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడంబము అని వ్రాయబడి ఉంది
ఈ లోకాశాలకు మనము లోబడిపోయి జీవించడానికి వీలులేదు
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము అని
ప్రియులారా మన కళ్ళు వ్యర్థమైనవాటిని చూడటానికి వీలులేదు
సామెతల గ్రంథము 4: 25 వచనంలో
నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము అని వ్రాయబడి ఉంది
యోబు ఈ విదంగా అంటున్నాడు
నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును అని
ఈ రోజు మన కన్నులతో మనం నిబందన చేసుకొనవలసిన వారమైయున్నాము
మన కళ్ళు పవిత్రంగా ఉంటేనే మన దేహమంతా వెలుగుమయమై ఉంటుంది కాబట్టి
మన కళ్ళను మనం పవిత్రంగా కాపాడుకోనవలసిన వారమైయున్నాము
మన కన్నులెప్పుడు దేవుని వాక్యం పై ఉండాలి
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అని అలాగే
నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును అని
సహోదరి సహోదరులారా
మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే పాపాన్ని జయించగలుగుతాం
కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటు
మన కళ్ళను పవిత్రంగా కాపాడుకుంటు
పాపంపై జయజీవితాన్ని జీవిద్దాం
No comments:
Post a Comment