యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు
యెషయా 40: 31
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.అని
ప్రియులారా
ఆయన కొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు అని వ్రాయబడి ఉంది
అబ్రాహాము దేవుని పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయల్దేరాడు
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను అని వ్రాయబడి ఉంది అలాగే విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను
సహోదరి సహోదరులారా
దేవుడు మన జీవితం పట్ల గొప్ప ఉద్యేషం కలిగి యున్నాడు
ఆయన మనకిచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చుటకు చాలినవాడు
కొన్ని సార్లు దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి ఆలస్యం అవ్వచ్చు
అటువంటి సమయంలో మన సమస్యను చూసి మన పరిస్థితులను చూసి మనం కృంగి పోవడానికి వీలులేదు సైతాను మనల్ని కృంగదీయడానికి శతవిదాల ప్రయత్నిస్తాడు దేవుని వాగ్దానాలనే అనుమానించేలా చేస్తాడు
దేవుడు మోషేతో
నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము అని చెప్పాడు
అక్కడికి వెళ్ళి చూసివచ్చిన ప్రజలు అక్కడున్న
ఉన్నత దేహులను చూసి భయంతో ఏడ్వడం ప్రారంబించారు కాని
యెహోషువా కాలేబు మాత్రం దేవుని వాగ్దానాన్ని విశ్వసించి
ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.
యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును;. అని అన్నారు
సహోదరి సహోదరులారా
మనము దేవుని వైపే చూస్తు బలము తెచ్చుకుని
దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను నమ్మి వాటిని మన జీవితంలో స్వతంత్రించుకొనవలసిన వారమైయున్నాము
No comments:
Post a Comment