యెహోవాయే నిన్ను కాపాడువాడు
నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును
కీర్తనలు 121: 5
దేవుడు తన రెక్కలతో మనలను కప్పును
వేటకాని ఉరిలో నుండి మనలను విడిపించువాడు
నాశనకరమైన తెగులు రాకుండ మనలను రక్షించువాడు ఆయనే
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతిలోనుండి నీ కుడిచేత రక్షించువాడా,
నీ కృపాతిశయములను చూపుము.
ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్నుకాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్కకుండను నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము అని
సహోదరి సహోదరులారా మన చుట్టు మన కుటుంబం చుట్టు మనము కలిగియున్నదంతటి చుట్టు ప్రార్దనా కంచెను మనము వేసుకొనవలసిన వారమైయున్నాము మన విరోదియైన అపవాది ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహమువలె తిరుగుచున్నాడు
మనము వానికి దొరక్కుండా ఉండాలంటే ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించవలసినవారమైయున్నాము
మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులమగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును దరించుకొనుడి
అని వ్రాయబడి ఉంది
ఏలా గనగా నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.
ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి.
ప్రియులారా నేను దేవుడిచ్చు సర్వాంగకవచమును దరించుకుని అపవాదిని ఎదురిస్తాను ప్రార్దన శక్తిని కలిగియుంటాను అన్నవారునాతో పాటు ప్రార్దనలో ఏకీభవించండి
పరిశుద్దుడా ప్రేమగలతండ్రి
మమ్ములను కాపాడువాడవు నీవే నీ రెక్కల చాటున మమ్మును భద్రపరచమని ప్రార్ధన శక్తిని మేము కలిగి ఉండుటకు సహాయం దయచేయుమని యేసు క్రీస్తు నామమున ప్రార్ధిస్తున్నాము తండ్రి ఆమెన్
No comments:
Post a Comment