నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను
కీర్తనలు 51: 4
ప్రియులారా
దావీదు మహారాజు బత్సేబాతో పాపము చేరిన తరువాత ప్రవక్తయైన నాతాను దావీదు చేసిన పాపాన్ని దావీదుకు గుర్తు చేసి దేవుని హెచ్చిరికను దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు రచించిన ఈ కీర్తన మనుషులమైన మనందరికి కనువిప్పు కలిగించేదిగా ఉంటుంది. దావీదు భక్తుడు మహా రాజై యుండి యుద్ధము చేయవలసిన వేళలో స్నానము చేస్తున్న బత్సేబాను చూసి ఆమెను మొహించి ఆమెతో పాపము చేసాడు. అటు తరువాత ఆమె గర్భవతియైనదని తెలుసుకొని ఆమె భర్తను ఒక పథకము వేసి యుద్ధములో చంపివేసాడు. ఇదంతా తన అహంకారం వలననే చేసి ఏ పాపమెరుగనట్టుగా జీవించాడు. అటువంటి సమయములో దావీదు నొద్దకు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదు చేసిన పాపమును గూర్చి దావీదుకు కనువిప్పు కలిగేలా తెలియజేసాడు. తాను చేసిన పాపమును గూర్చి దావీదు భక్తుడు ఎంతగానో క్రుంగిపోయి
తన పాపములను ఈ విధముగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు
దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.
నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. అని
ప్రియులారా
తాను చేసిన పాపము ఎవరికి తెలియదను అనుకొనెను గాని దేవుని హెచ్చరికను వినిన తరువాత
తాను మనుషుల యెడల కాదు గాని దేవునికె కేవలం
దేవుని దృష్టికె తాను పాపము చేసానని గ్రహించాడు
గొఱ్ఱెల కాపరియై చిన్న గొఱ్ఱెల మందను మేపుకునే దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించి అతనిని శక్తివంతమైన తన ప్రజలకు రాజుగా నియమించెను
అటువంటి దేవుని ద్రుష్టికి అతడు పాపము చేసెను
అందుకే అతడు తన మనసునందు కృంగిపోయి
తన విరిగిన మనసును బలిగా దేవునికి అర్పిస్తున్నాడు
ప్రియులారా మనము అనేక సార్లు అబద్ధములు పలుకుతూ మన తోటివారిని ఎన్నో సార్లు మోసం చేసి యుంటాము మనము ఎన్నో సార్లు తప్పులు చేసిన ఎవరికి దొరకకుండా తప్పించుకుని ఉండిఉంటాము
అయితే అందును బట్టి మనము అతిశయించుటకు వీలులేదు ఎందుకంటే మన దేవుని ఎదుట మన పాపములు కనిపిస్తూనే ఉంటాయి. మన పాపములను బట్టి మనకు తీర్పు తీర్చువారు
మనుషులు కారు గాని సర్వశక్తిమంతుడైన దేవుడే మనకు తీర్పు తీర్చువాడై యున్నాడు.
మనము మనుషులను మోసపరచి వారినుండి తప్పించుకొనవచ్చును గాని దేవుని నుండి మనము తప్పించుకొనలేము అందుకే మనము మనుషుల దృష్టికి కాదు గాని దేవుని దృష్టికే నీతిమంతులుగా ఉండాలి
పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నువేసి తనతో పాపము చేయమని చెప్పెను. అప్పుడు యోసేపు ఆమెతో నేనెట్లు ఇంత గోరమైన దుష్కార్యము చేసిన దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని చెప్పి అక్కడనుండి పారిపోయెను.
ప్రియులారా
యోసేపు పాపము చేయుటకు తనకు అడ్డుగా ఎవరు లేరు అయినను యోసేపు ఎటువంటి పాపము చేయుటకు ఇష్టపడలేదు. అందుకు గల కారణం
యోసేపు మనుషుల దృష్టికి కాదు గాని తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిమంతునిగా ఉండాలని ఇష్టపడ్డాడు అందుకే అతడు ఆ పాపము నుండి పారిపోయాడు
ప్రియులారా దావీదు పాపము చేసిన పశ్చాత్తాపపడి
తన పాపమును ఒప్పుకొని దేవుని దృష్టికి నీతిమంతుడైనాడు అందుకే దేవుని ప్రవక్త దావీదును గురించి ఈ సాక్ష్యము చెబుతున్నాడు
దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి యందు తప్ప
తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి
యధార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును
తప్పిపోకుండెను అని
ప్రియులారా
దావీదు పాపము చేసినను ఆ పాపము వలన దేవుని సన్నిధికి ఎంతగానో దూరమై మరల దేవుని కనికరమును పొందుకొనుటకు ఎంతగానో ప్రయాసపడెను దేవుడు దావీదు చేసిన పాపమును క్షమించి అతనిని నీతిమంతునిగా చేసెను మరల దావీదు ఏ పాపము చేయక దేవుని దృష్టికి నిందారహితముగా ఉండెను
యోసేపు దేవుని యందు భయము గలవాడై
పాపము నుండి పారిపోయెను
ప్రియులారా
మన జీవితంలో అనేక సార్లు పాపము చేయవలసిన సందర్భాలు కలిగినప్పుడు మనము దావీదు వాలే పాపము వైపు పరిగెడుతున్నామా లేక యోసేపు వాలే పాపము నుండి తప్పించుకొనుటకు పరిగెడుతున్నామా అని మనలను మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ దావీదు వలే పాపము చేసి మనలను మనము సమర్థించు కొనుటకు వీలులేదు
ఎందుకంటే దావీదు ఆ ఒక్క పాపము చేసి ఎంతగానో
పశ్చాత్తపడి మరలా దేవుని సన్నిధిని పొందుకుని
తాను బ్రతికినన్నాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతినిగా జీవించెను. అటువంటి జీవితం మనలో ఉందా లేక
దేవుని యెడల భక్తి ఉన్నట్టు నటిస్తూ పాపపు మార్గమునే ప్రేమించి ఆ పాపములోనే ఉండుటకు ఇష్టపడే వారముగా మన జీవితం ఉందా
మనలను మనమే పరిశీలించుకోవాలి ఒకవేళ మనము పాపమునే ప్రేమించే వారమైతే మనము మనుషులకు లెక్క అప్పగించవలసిన పని లేదు కానీ మన పాపములు ఎరిగిన దేవునికే లెక్క అప్పగించువారమై యున్నామని గమనించి ఏ పాపము చేయకుండా ఎక్కువ సమయము ప్రార్ధన లో గడుపుతూ దేవుని శక్తి వలన ప్రతి పాపమును
దావీదువలే జయించు వారమై యుందాం
ఈ వాక్యము దేవుని దృష్టికి మనము నీతిమంతులముగా ఉండాలని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని
ధ్యానిస్తూ ప్రార్ధన వలన ప్రతీ పాపాన్ని జయించువారమై యుందాం దేవుని కృప దావీదు కు తోడై యున్నట్టుగా మనకును తోడై దేవుని దృష్టికి మనలను నీతిమంతులనుగా చేయును గాక. ఆమెన్
No comments:
Post a Comment