ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
మత్తయి 25: 13
ప్రియులారా మనము ఈ లోకములో ఒక నిరీక్షణ గలవారమై యున్నాము మనము దేవుని నిత్య రాజ్యములో చేరాలని ఆయన రాకడలో మనమెత్తబడాలని ఆశ గలవారమై యున్నాము
అయితే దానిని మనము పొందుకొనుటకు మెలకువ గలవారమై యుండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది మరి ఏ ఏ విషయాల్లో మనము మెలకువ గలవారమై ఉండాలంటే మొదటగా మనము పాపములో పడిపోకుండా ఉండుటకు మెలకువగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఈ విధముగా తెలియజేస్తుంది నిబ్బరమైన బుద్ది గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధియైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదున అని వెదకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి అని
ప్రియులారా సాతాను మనలను దేవునికి దూరం చేయుటకు ఎలాగైనా మనలను పాపములో పడవేయుటకు సింహము వలె ఎదురుచూచుచున్నాడు అందుకే మనము మెలకువ కలిగి వాని కుతంత్రాలను దేవుని యందు స్థిరమైన విశ్వాసం వలన జయించువారమై యుండాలి
రెండవదిగా మన పరిశుద్ధతను కాపాడుకొనుటకు
మనము మెళుకువగలవారమై యుండాలి
అనగా పరిశుద్ధులకు అనేక శ్రమలు కలుగుతాయి అయితే అవన్నియు వారికీ మేలుకలుగుటకే కలుగుతాయని గ్రహించి ఆ శ్రమలలో మన పరిశుద్ధతను కోల్పోకుండా ఉండాలి
ఉదాహరణకు
యోసేపు పరిశుద్ధతను కోల్పోజేయుటకు శ్రమ పోతీఫర్ భార్య ద్వారా అతనికి కలిగెను అయితే యోసేపు ఆమె నుండి పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకొనెను అలాగే యోబు సమస్తము కోల్పోయిన
తర్వాత తన భార్యా ద్వారా అతనికి శ్రమ కలిగెను
కానీ ఆమె మాటలను యోబు పట్టించుకోకుండా
ముర్కురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము అనుభవింప తగదా అని తన మాట వలన కూడా ఏ పాపమును చేయక తన పరిశుద్ధతను యోబు కాపాడుకొనెను
ప్రియులారా
ఎటువంటి శ్రమ కలిగిన మనము మెలకువ గలవారమై
ఆ శ్రమను దేవుని వలన ఆశీర్వాదముగా మలచుకొనువారమై యున్నాము
దేవుని రాజ్యములో దేవునితో పాటు మనము ప్రవేశించాలంటే మనము ఆయన రాకడ కొరకై సిద్ధపాటు కలిగిన స్త్రీల వలె మన పరిశుద్ధతను కాపాడుకొనువారమై యున్నాము
అందుకే ప్రతిదినము దేవుని వాక్యము చదువుటలోను
ఆ వాక్యానుసారముగా జీవించుటలోను
మెలకువ గలవారమై జీవిద్దాం
ఈ వాక్యం దేవుని నీతిమార్గములో మెలకువ కలిగి ఉండాలని తేలజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని రాకడకై సిద్ధపడుదాం
దేవుని ఆత్మ సిద్ధపడిన కన్యకలకు తోడై యుండినట్టుగా మనకును తోడై మెలుకువగా
మనలను జీవింప జేయును గాక. ఆమెన్
No comments:
Post a Comment