“నా తల్లి కన్నీటి ప్రార్ధనా ప్రవాహంలో నేను దేవుని
రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చితిని”
-అగస్టీన్
“ప్రభువా! స్కాట్లాండ్ దేశమును నా కిమ్ము! లేని యెడల నా ఆత్మను తీసుకొనుము”
- జాన్నాక్స్
“లోకమే నా సేవా స్థలం”
- జాన్ వెస్లీ
“క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నాకు వేయి జన్మలు,
వేయి శరీరాలు, వేయి నోళ్ళు ఉండిన ఎంత బాగుండును?"
-జార్జివిటీ ఫీల్డ్
“నేనెంత బలహీనుడనైనా, ఎన్ని శ్రమల నెదుర్కొన్నా మరణం వరకు ఆత్మలను సంపాదించగల్గితే నా కదే పది వేలు"
-డేవిడ్ బ్రెయినార్డు
“నేను చనిపోయిన తర్వాత నా రక్షకుని గురించే
మాట్లాడండి. మంటి పురుగునైన నా గురించి కాదు"
-విలియం కేరి
"లోకమంతా ఎదురుతిరిగినా పిశాచాలన్నీ చుట్టుముట్టినా నేను మోకాళ్లపై నుండి లేవను”
-ఛార్లెస్. జి. ఫిన్నీ
“నేను 200 సార్లు బైబిలు చదివితిని, అనేక వేల సార్లు
ప్రార్థనకు జవాబు పొందితిని, రక్షింపబడి 70 సం||లు
ప్రభువు కొరకు బ్రదికితిని. అయినను నేను దేవుని దృష్టిలో చిన్నవాడినే” -జార్జిముల్లర్
“నా జీవిత సర్వస్వాన్ని ఆఫ్రికాకు అంకితం చేయడంలో
త్యాగం చేసానని ప్రజలు నన్ను ఎంతో పొగడుచున్నారు గాని నేను దేవునికి ఎంతో ఋణపడి యున్నానని అంగలార్చుచున్నాను"
-డేవిడ్ విలింగ్స్టన్
“నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని ఎలాగూ పురుగులు తింటాయి. నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు నరమాంస భక్షకులు తింటే మాత్రం ఏమి?" -జాన్.జి.పేటన్
"ప్రజలకు సువార్త అందించుటయేగాక వారి శరీర
అవసరతను, ఆకలి బాధను తీర్చుట కూడా అవసరమే”
-విలియంబూత్
''నేను దేవుని చిత్తంలో చేసిన దేవుని సేవకు దేవుని సహాయం తక్కువ కాదు”
-హడ్సన్ టేలర్
“ఆత్మల సంపాదనే నా పని”
-డి.యల్.మూడీ
“ఆఫ్రికా అరణ్యంలో ప్రజలు క్రీస్తు శిష్యులయ్యారంటే ఇది నా ప్రజ్ఞ కాదు, ప్రభువు కృపే!”
-మేరీ స్లెస్సర్
ప్రభువే నా ఆదరణ, సహాయకర్త:
ప్రార్ధన, వాక్యధ్యానమే నా నిధి"
-పండిత రమాభాయి
ప్రతి 15 ని.లకు బైబిల్ చదవకుండా, ప్రతి 30 ని.లకు
మోకరించి ప్రార్థస చేయకుండా నేనుండలేను”
-స్మిత్ విగ్గిల్స్ వర్
ఒక జూదగాడు జూదంలో ఉన్నదంతా కోల్పోయినట్లే క్రీస్తు కొరకు మనం ఉన్నదంతా ఎందుకు త్యాగం చేయకూడదు.
-ఛార్లెస్ టి. స్టడ్
క్రీస్తుని లోకానికి ప్రకటించుటయే నా ధ్యేయం”
-సాధు సుందర్ సింగ్
No comments:
Post a Comment