పూర్తి పేరు: ఫ్రాన్సిస్
జన్మస్థలం: ఇటలీలోని 'అసిసీ' పట్టణము
తల్లిదండ్రులు: పీటర్ బర్నాడ్ దంపతులు
జననం: క్రీశ. 1181వ సంవత్సరము
మరణము: క్రీ.శ. 1226 అక్టోబర్ 13
రక్షణానుభవం: 20 సం||ల వయస్సులో
సేవా ఫలితం: పేదలకు, వ్యాధి గ్రస్థులకు, కుష్ఠురోగులకు సేవచేసి, క్రీస్తు ప్రేమను వారు గ్రహించునట్లు చేసి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించెను.
ఫ్రాన్సిస్ 1181 వ సంవత్సరములో 'పీటర్ బర్నాడ్' అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్థునికి ఇటలీలోని ఉంబ్రియా ప్రాంతమునకు చెందిన “అసిస్సీ" పట్టణములో జన్మించెను. అతని తండ్రి చాలా మూర్ఖత కల్గిన, కఠినుడైన వ్యక్తి! ఫ్రాన్సిస్ పెద్ద
వాడగుచుండగా తన తండ్రిని ద్వేషించుట మొదలు పెట్టెను. గాని అతని వ్యాపారమును, ధనమును ప్రేమించెను. 14 సంవత్సరముల వయస్సులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకొని డబ్బు సంపాదించుట మొదలు పెట్టెను.
తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా, ఫ్రాన్సిస్ చేతినిండా డబ్బుతో విపరీతమైన విలాసాలతో, ఆడంబర ములతో, అహంభావముతో, ఆటలతో తన యౌవన జీవితమును గడుపుచుండెను.
ధనవంతులతో సహవాసము చేయుచు తన జీవితమును వ్యర్థపరచుకొనుచుండెను.
ఒకసారి రోమా పట్టణమునకు యాత్రకు వెళ్ళెను. అక్కడ కుష్ఠురోగులను, పేదలను
చూచినపుడు అతని హృదయము ద్రవించెను.
ఫ్రాన్సిస్ తన 20 వ సంవత్సరములో ఒక భయంకరమైన వ్యాధికి గురై బహు బలహీనుడాయెను. ఆ వ్యాధిలో దేవుని స్వరమును వినెను. “నీవు యజమానుని సేవించటం మేలా? లేక దాసుని సేవించటం మేలా? యజమానుడనైన నన్ను విడిచి, లోక భోగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావా?” అను పలుకులు తన పాప జీవితము కొరకై లోతుగా పశ్చాత్తాపపడునట్లు చేసెను.
ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్లో ఒక మార్పు కలిగెను. ఏకాంతముగా వెళ్లి ప్రార్ధన చేసుకొనుటకు, క్రీస్తువలె జీవించుటకు అధికముగా ఆశించెను.
ఒకరోజు 'సాండిమెన్' అనే ఆలయమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుట మొదలు పెట్టెను. అలా ప్రార్థించుచుండగా “ఫ్రాన్సిస్, పాడైపోయి యుండుట చూచితివా? వెళ్ళి బాగు చేయి!" అను ఒక మెల్లని స్వరమును వినెను. ఆశ్చర్యపడ్డ ఫ్రాన్సిస్ సంతోషముతో “తప్పకుండా చేయుదును ప్రభువా!"
అనెను. తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయ కట్టడములను బాగుచేయ మొదలు పెటెను.
అతని తండ్రి నా డబ్బు వాడుచున్నావే అని ప్రాన్సిస్ తో తగాదా పడి అతనిని కోర్టుకు లాగెను
“నీవు దేవుని సేవ చేయవలెనన్నచో నీ తండ్రి
డబ్బును తిరిగి యిచ్చి వేయవలెను” అని ఆనాడు న్యాయాధిపతిగా ఉన్న బిషప్పు చెప్పెను. అప్పటికే “పిచ్చివాడు” అన్న పేరు తెచ్చున్న ఫ్రాన్సిస్ బహు. చల్లటి వాతావరణములో కూడా తాను వేసుకొన్న వస్త్రములను, ఆభరణములను, తన దగ్గర ఉన్న డబ్బంతటిని అప్పటికప్పుడే తీసి తండ్రికి యిచ్చివేసెను. ఆశ్చర్యపోవుచున్న జనసమూహముతో, “నేనిక స్వేచ్ఛగా దేవుని సేవ
చేసెదను. నా అవసరతల కొరకు పరలోకమందున్న నా తండ్రికే ప్రార్థించి పొందెదను” అనెను. చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలగు కట్టడ అవసరతలను అడుగుకొనుచు పాడుబడిన ఆలయములను కట్టుచుండెను.
ధనవంతుని కుమారుడై యుండియు, ఆహారము కొరకు కూడా ఇతరులను అడుక్కొనుచున్నందున కుటుంబమునకు సిగ్గు తెచ్చెను. అయితే, 1208వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభువు
సువార్తను చదువుచుండగా, పరిశుద్ధాత్మ వలన ముట్టబడెను. యేసుక్రీస్తు తన శిష్యులను పంపినపుడు వారితో డబ్బునైనను, సంచినైనను తీసుకొని వెళ్ళవద్దని;
సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగజేసెను; అతడు తన దట్టీని, చెప్పులను, కర్రను తీసివేసి; సామాన్యమైన ఒక అంగీని ధరించి, నడుము చుట్టూ ఒక త్రాడు కట్టుకొనెను. దేవుని సంఘమును కట్టుట అంటే కట్టడములు కాదు ఆత్మలను సంపాదించుట అని గ్రహించుకొనెను. అప్పటినుండి పడిపోయిన చర్చి గోడలు కట్టుటమాని సువార్తను
ప్రకటించుట ద్వారా ఆత్మలను రక్షణలోనికి నడిపించుట మొదలు పెట్టెను.
“ప్రభువు నీకు సమాధానమిచ్చును గాక!” అని ఇతరులను పలుకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించు చుండెను. అంతవరకు పిచ్చివాడనుకొన్న మనుష్యులు అప్పటినుండి అతనిని ఘనునిగా ఎంచి అతని మాటలు వినుచుండిరి. మరనేక మంది ధనవంతులైన యౌవనులు కూడా వారి ధనమును విడిచి పెట్టి ఫ్రాన్సిస్ తో కలిసి దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెదకుచుండిరి. ఒక సంవత్సరంలో 12
మంది సహోదరులు ఫ్రాన్సితో చేరిరి. వారందరు కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థించుచు, ఉదయము నుండి సువార్తను ప్రకటించుచుండిరి. ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్ధనల ద్వారా శరీరేచ్ఛలను జయించెడివాడు, తన
శరీరమును “గాడిద” అని పిలుచుకుంటూ క్రీస్తు కొరకు లొంగదీసుకొనెడివాడు. ఒకప్పుడు సుఖభోగాలయందు జీవించుచు, బీదలను తృణీకరించెడి ఫ్రాన్సిస్ ఇప్పుడు దారిద్ర్యమును ప్రేమించుచు; పేదలకు, వ్యాధి గస్థులకు, కుష్ఠురోగులకు సేవ చేయుటయే తన జీవిత ధ్వేయముగా భావించెను. సేవ అక్కరలకై దేవుని నెపు
చూచుచుండెను. ఈయన బోధ మిక్కిలి సూక్ష్మమైనదిగాను, మనస్సాక్షి' మారుమనస్సులోనికి నడిపించునదిగాను ఉండెను. ఈయనను సమీపిం
భయంకరమైన దొంగలు మార్చబడిరి. కుష్ఠురోగులను ప్రేమించి, వారి గాయములు కడుగుచుండగానే వారు పూర్తి స్వస్థత పొందుచుండెడివారు. ఇతడు దేవుడు చేసిన జంతువులను, పక్షులను బహుగా ప్రేమిస్తూ, వాటికి కూడా సువార్తను ప్రకటించుచూ, ప్రభువును, స్తుతించుమని పక్షులతో పలికినపుడు అవి పాటలు
పాడుచుండెడివి.
ఇతడు చాలాసార్లు ఇటలీ సరిహద్దులను దాటి సువార్తను ప్రకటించెను. 1214 లో మొరాకో ప్రాంతానికి వెళ్ళి అచ్చటి ప్రజలను రక్షించాలని, అవసరమైతే
అచ్చట హతసాక్షిగా మరణించాలని ప్రయాణమయ్యెను. కాని అనారోగ్యము వలన
తిరిగి రావలసి వచ్చెను. 1219 లో పాలస్తీనాకు వెళ్ళి అచ్చట ముస్లింలకు సువార్తను
ప్రకటించెను. గాని అతని ఆరోగ్యం మరింత క్షీణించగా అతని కనుదృష్టి తగ్గిపోగా తిరిగి అసిస్సీకి వచ్చెను. 1224 సెప్టెంబరు నెలలో అతని కాళ్ళలో, చేతులలో
గాయములు ఏర్పడినందున నడవలేని స్థితిలో గాడిదపై మాత్రము ప్రయాణము చేసెను. ఒక చిన్న గుడిసెలో తన చివరి దినములు గడిపెను.
ఈయన మరణ సమయంలో, “ప్రేమ అను ఆయుధము కలవాడే ఈ సేవ కొనసాగించుటకు తగినవాడు” అని చెప్పి, 1226 అక్టోబరు 13వ తేదీ
రాత్రి, తన 45వ యేట ప్రభువు నొద్దకు వెళ్ళెను
ఈ కల్వరి యోధుడు.
No comments:
Post a Comment